Salman khan: 'మీ అందరి ఆరోగ్యం ఎలా ఉంది'..? హెల్త్ రూమర్లపై సల్మాన్ ఖాన్ స్ట్రాంగ్ కౌంటర్!
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఆరోగ్యంపై రెండు రోజులుగా సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్ గతంతో పోలిస్తే కాస్త సన్నగా, అలసటగా కనిపించడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. సల్మాన్ ఖాన్ అనారోగ్యంతో బాధపడుతున్నారనే వార్తలు వైరల్ అవుతున్న వేళ, వాటికి ఆయన తనదైన స్టైల్‌లో సమాధానం ఇచ్చారు. తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని బ్లాక్ అండ్ వైట్ ఫొటోలను పంచుకున్న ఆయన, "మీ అందరి ఆరోగ్యం ఎలా ఉంది..? అనే సరదా క్యాప్షన్‌ను జత చేశారు.
వివరాలు
స్పందించిన బాలీవుడ్ ప్రముఖులు
ఈ ఒక్క క్యాప్షన్‌తోనే తాను పూర్తిగా ఆరోగ్యంగానే ఉన్నానని సల్మాన్ పరోక్షంగా చెప్పినట్లైంది.
ఆయన పోస్ట్‌కు అభిమానులతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా నవ్వుతున్న ఎమోజీలతో స్పందిస్తూ సందడి చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం సల్మాన్ ఖాన్ 'మాతృభూమి' చిత్రంలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా సెన్సార్‌కు సంబంధించిన కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నట్లు సమాచారం.
ఈ అంశంపై మీడియా ప్రశ్నించగా సల్మాన్ ఎలాంటి వ్యాఖ్య చేయకుండా మౌనం పాటించారు. దీంతో సినిమా విడుదలపై కొంత అనిశ్చితి నెలకొంది.
షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేయాలని చిత్రబృందం ప్రణాళిక సిద్ధం చేసిన సంగతి తెలిసిందే.