Dhurandhar: 'ధురంధర్'పై హృతిక్ ప్రశంసలు.. పార్ట్ 2 పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకుంటున్న 'ధురంధర్' (Dhurandhar) మూవీపై బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ చేసిన కామెంట్లు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. తన వ్యాఖ్యల కారణంగా హృతిక్ విమర్శలు ఎదుర్కొన్నారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై దర్శకుడు ఆదిత్య ధర్ (Aditya Dhar) స్పందించారు. హృతిక్ సినిమాలోని పని, అద్భుతమైన టెక్నికల్ వర్క్‌ను ప్రశంసించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. హృతిక్ తన పోస్ట్‌లో ఈ సినిమా నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నట్టు తెలిపారు. అయితే సినిమాలో చూపించిన రాజకీయ అంశాలను తాను అంగీకరించని విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. విమర్శలు వచ్చిన తర్వాత, హృతిక్ మరో పోస్ట్‌లో 'ధురంధర్' తన హృదయానికి హత్తిన సినిమా అని, ఆదిత్య అద్భుతంగా తెరకెక్కించారని ప్రశంసలు కురిపించారు.
Details
సంతోషంలో అభిమానులు
దీని ప్రతిగా ఆదిత్య ధర్ రిప్లై చేశారు. ఈ చిత్రంపై మీరు చూపిన ప్రేమకు ధన్యవాదాలు. ఇందులో పనిచేసిన వారంతా వందశాతం కష్టపడ్డారు. మీ ప్రశంసలకు వారు అందరూ అర్హులు. దీనికి పార్ట్ 2 కూడా ఉంటుంది. ఆ మూవీని రూపొందిస్తున్నప్పుడు అందరి సూచనలను పరిగణలోకి తీసుకుంటాం. వాటికి అనుగుణంగా తయారుచేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తామన్నారు. 'ధురంధర్'లో రణ్‌వీర్ సింగ్, మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించి, కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పటివరకు రూ.230 కోట్లు వసూలు చేసింది. సినిమాకు ఇప్పటికే పార్ట్ 2 ఉంటుందని ప్రకటించడంతో అభిమానులు సంబరపడ్డారు.