LOADING...
Project Hail Mary: హాలీవుడ్ మూవీకి హృతిక్ సపోర్ట్.. 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' ప్రమోషన్‌లో కొత్త స్టైల్
హాలీవుడ్ మూవీకి హృతిక్ సపోర్ట్.. 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' ప్రమోషన్‌లో కొత్త స్టైల్

Project Hail Mary: హాలీవుడ్ మూవీకి హృతిక్ సపోర్ట్.. 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' ప్రమోషన్‌లో కొత్త స్టైల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 23, 2026
05:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, హాలీవుడ్ సైన్స్-ఫిక్షన్ చిత్రం ప్రాజెక్ట్ హేల్ మేరీ ప్రమోషన్స్ కోసం హాలీవుడ్ టీంతో చేతులు కలిపారు. భారతీయ ప్రేక్షకులకు ఈ సినిమాను దగ్గర చేయడానికి హృతిక్ ఒక క్రేజీ క్రాసోవర్ వీడియోతో ముందుకొచ్చారు. 'జాదూ వర్సెస్ రాకీ' పేరుతో విడుదలైన ఈ వీడియోలో, హృతిక్ తన సూపర్ హిట్ సాంగ్ ఏక్ పాల్ కా జీనా లోని ఐకానిక్ స్టెప్‌ను ఈసినిమాలోని ఏలియన్ క్యారెక్టర్ 'రాకీ'కి నేర్పుతున్నట్లు చూపించారు. హృతిక్, రాకీ మధ్య ఏర్పడిన ఫన్ ఫ్రెండ్షిప్‌ను చూసి, కోయి... మిల్ గయాలోని ఆయన పాత ఏలియన్ స్నేహితుడు 'జాదూ' క్యూట్‌గా రియాక్ట్ అవ్వడం ఈ వీడియోలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

వివరాలు

బెస్ట్‌సెల్లింగ్ నవల ఆధారంగా సినిమా

హాలీవుడ్ స్టార్ ర్యాన్ గోస్లింగ్ నటించిన ఈ చిత్రం, ఆండీ వీర్ రచించిన అదే పేరుతో ఉన్న బెస్ట్‌సెల్లింగ్ నవల ఆధారంగా తెరకెక్కింది. డిసెంబర్ 2025లో ఈ పుస్తకంపై తన అభిమానాన్ని హృతిక్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇప్పుడు అదే సినిమాను ఇండియాలో ప్రమోట్ చేయడం విశేషంగా మారింది.

వివరాలు

చిత్రబృందం ఆనందం

హృతిక్ లాంటి స్టార్ తమ సినిమాను ప్రమోట్ చేయడం పట్ల సోని పిక్చర్స్ ఇండియా ప్రతినిధి షోనీ పంజీకరణ్ ఆనందం వ్యక్తం చేశారు దర్శకులు, నటీనటులు ఈ చిత్రానికి ఫిల్ లార్డ్ మరియు క్రిస్టోఫర్ మిల్లర్ దర్శకత్వం వహించారు. ఇందులో ర్యాన్ గోస్లింగ్‌తో పాటు సాండ్రా హుల్లర్, కెన్ లెయుంగ్ ముఖ్య పాత్రల్లో నటించారు. విడుదల వివరాలు ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఐమాక్స్ ఫార్మాట్‌లో ఈ చిత్రం భారతదేశంలో 2026 మార్చి 26న విడుదల కానుంది.

Advertisement