ఊపందుకున్న ఏజెంట్ ప్రమోషన్స్, ట్రైలర్ లాంచ్ కోసం భారీగా ఏర్పాట్లు
ఈ వార్తాకథనం ఏంటి
అక్కినేని అఖిల్ పాన్ ఇండియా రేంజ్ లో ఏజెంట్ సినిమాతో వస్తున్నాడు. కాకపోతే తెలుగులో రిలీజ్ అయిన కొన్ని రోజులకు హిందీలో రిలీజ్ అవుతుందని ప్రెస్ మీట్ లో అఖిల్ వెల్లడి చేసిన సంగతి తెలిసిందే.
ప్రెస్ మీట్ నుండి మొదలైన ఏజెంట్ ప్రమోషన్స్, ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ట్రైలర్ లాంచ్ డేట్ ని రివీల్ చేస్తూ, 172అడుగుల బిల్డింగ్ మీద నుండి కిందకు దూకాడు అఖిల్.
తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటివరకు ఏ హీరో కూడా బహిరంగంగా ఇలాంటి స్టంట్ చేయలేదు. అందుకే ప్రస్తుతం ఏజెంట్ గురించి చర్చ విపరీతంగా నడుస్తోంది.
ఏజెంట్ సినిమా గురించి అఖిల్ చాలా నమ్మాడు కాబట్టే అంతలా స్టంట్ చేయగలిగాడని నెటిజన్లు కామెంట్లు విసురుతున్నారు.
Details
కాకినాడలో ట్రైలర్ లాంచ్
ప్రస్తుతం ఏజెంట్ ప్రమోషన్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. రేపు సాయంత్రం 7:30గంటలకు ఏజెంట్ ట్రైలర్ లాంచ్ జరగనుంది. కాకినాడలోని మెక్ లారెన్ హై స్కూల్ లో ఈ వేడుక జరగనుంది.
యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఏజెంట్ సినిమాలో మళయాలం నటుడు మమ్ముట్టి ప్రధాన పాత్రలో కనిపిస్తున్నారు. అలాగే బాలీవుడ్ నటుడు డినో మోరియో కీలక పాత్రలో చేస్తున్నారు.
సాక్షి వైద్యా హీరోయిన్ గా కనిపించిన ఈ చిత్రం నుండి ఇప్పటివరకు మూడు పాటలు రిలీజ్ అయ్యాయి. ఏకే ఎంటర్ టైన్మెంట్స్, సరెండర్ 2 సినిమాస్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమాను అనిల్ సుంకర్ నిర్మిస్తున్నారు.
తెలుగు సినిమాకు కలిసి వచ్చిన తేదీ, ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.