LOADING...
LENIN : అఖిల్ 'లెనిన్'కు భారీ బిజినెస్.. ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ డీల్ క్లోజ్!
అఖిల్ 'లెనిన్'కు భారీ బిజినెస్.. ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ డీల్ క్లోజ్!

LENIN : అఖిల్ 'లెనిన్'కు భారీ బిజినెస్.. ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ డీల్ క్లోజ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 09, 2026
11:14 am

ఈ వార్తాకథనం ఏంటి

అక్కినేని యువ హీరో అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం 'లెనిన్'పై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 'వినరో భాగ్యము విష్ణుకథ' ఫేమ్ మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, మనం ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఊరమాస్ గ్రామీణ ప్రేమకథ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమాపై బజ్ గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా అఖిల్ కొత్త లుక్, మాస్ ఎలిమెంట్స్, ఎమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

వివరాలు

కథానాయికగా భాగ్యశ్రీ బోర్సే

దీంతో సినిమా విడుదలకు ముందే థియేట్రికల్ బిజినెస్‌లో మంచి స్పందన కనిపిస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం రాయలసీమ మినహా ఆంధ్రప్రదేశ్‌లోని మిగతా ప్రాంతాల థియేట్రికల్ హక్కులు దాదాపు రూ.9 కోట్ల రేషియోలో క్లోజ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. అఖిల్ గత చిత్రం 'ఏజెంట్' బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయం చవిచూసినప్పటికీ, 'లెనిన్' కథాంశం, ప్రచార చిత్రాల్లో కనిపిస్తున్న మాస్ అప్పీల్ కారణంగా డిస్ట్రిబ్యూటర్లు ఈ స్థాయి పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చినట్లు సమాచారం. ఈ చిత్రంలో అఖిల్ సరికొత్త రఫ్ అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించనుండగా, ఆయన సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది.

వివరాలు

ఆసక్తిగా ఎదురుచూస్తున్న అక్కినేని అభిమానులు

సంగీత దర్శకుడు థమన్ అందిస్తున్న మ్యూజిక్ కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని భావిస్తున్నారు. అఖిల్ కెరీర్‌లో ఈ సినిమా కీలక మలుపు కానుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 'లెనిన్'తో అఖిల్ బాక్సాఫీస్ వద్ద బలమైన కంబ్యాక్ ఇస్తాడనే నమ్మకం అక్కినేని అభిమానుల్లో కనిపిస్తోంది. ఇక ఆంధ్ర ప్రాంతంలోనే రూ.9 కోట్ల రేషియోలో బిజినెస్ జరిగిందనే ప్రచారం నేపథ్యంలో, రాయలసీమ హక్కులు కూడా మంచి ధరకు అమ్ముడయ్యే అవకాశాలు ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు నైజాం ప్రాంతంలో ఈ చిత్రాన్ని అన్నపూర్ణ సంస్థ సొంత డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Advertisement