Pawan Kalyan: OG-2 పై భారీ అంచనాలు.. సెప్టెంబర్ 2న సర్‌ప్రైజ్ వస్తుందా?
ఈ వార్తాకథనం ఏంటి
సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు భారీగా వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు సుజీత్ తెరకెక్కించనున్న మోస్ట్ అవైటెడ్ గ్యాంగ్‌స్టర్ ప్రాజెక్ట్ 'OG 2' నుంచి ఎలాంటి అప్‌డేట్ వస్తుందోనని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ 'OG 2' ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించింది. పవన్ కళ్యాణ్-సుజీత్ కాంబినేషన్‌లో 'OG యూనివర్స్'ను మరింత విస్తరించనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.
వివరాలు
బర్త్‌డే సర్‌ప్రైజ్‌పై హింట్స్
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా గతంలో పలు సందర్భాల్లో పవన్ కల్యాణ్ పుట్టినరోజున 'OG 2' నుంచి సర్‌ప్రైజ్ ఉంటుందని హింట్స్ ఇచ్చారు.
మరోవైపు దర్శకుడు సుజీత్ ఓ పవర్‌ఫుల్ యానిమేటెడ్ వీడియోను సిద్ధం చేస్తున్నారనే ప్రచారం కూడా ఫిలింనగర్ వర్గాల్లో జరిగింది.
అయితే ప్రస్తుతం మేకర్స్ నుంచి 'OG 2'కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం ఆసక్తికరంగా మారింది.
వివరాలు
పోస్టర్ లేదా గ్లింప్స్ మాత్రమే?
ప్రస్తుతం పవన్ కల్యాణ్ భుజం గాయం కారణంగా ఆయుర్వేద చికిత్స కోసం కేరళలో ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా 'OG 2' నుంచి భారీ వీడియోను విడుదల చేయకుండా.. ఫస్ట్ లుక్ పోస్టర్ లేదా చిన్న ప్రమోషనల్ గ్లింప్స్‌ను మాత్రమే తీసుకొచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
బర్త్‌డే సందర్భంగా పోస్టర్ లేదా గ్లింప్స్ విడుదల చేసినా.. షూటింగ్ మాత్రం వెంటనే ప్రారంభమయ్యే అవకాశాలు లేవని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా 'OG 2' నుంచి ఎలాంటి సర్‌ప్రైజ్ రాబోతోంది? పోస్టర్ వస్తుందా.. గ్లింప్స్‌తో ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.