LOADING...
Ustaad Bhagat Singh: 'ఉస్తాద్ భగత్‌సింగ్'కు భారీ ఓటీటీ డీల్.. 20 నిమిషాల్లోనే గ్రీన్ సిగ్నల్!
'ఉస్తాద్ భగత్‌సింగ్'కు భారీ ఓటీటీ డీల్.. 20 నిమిషాల్లోనే గ్రీన్ సిగ్నల్!

Ustaad Bhagat Singh: 'ఉస్తాద్ భగత్‌సింగ్'కు భారీ ఓటీటీ డీల్.. 20 నిమిషాల్లోనే గ్రీన్ సిగ్నల్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 07, 2026
10:59 am

ఈ వార్తాకథనం ఏంటి

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని హరిష్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం మార్చి 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా హరీశ్ శంకర్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, సినిమా షూటింగ్ ప్రారంభమైన కొన్ని రోజులకే ఓటీటీ డీల్ కుదిరిందని తెలిపారు. వ్యక్తిగతంగా పరిశీలించేందుకు కీలక సన్నివేశాలను ఎడిట్ చేసి చిన్న వీడియో తయారు చేసుకున్నానని, ఆ విజువల్స్‌ను చూసిన నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధులు సినిమాపై సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు.

Details

రూ.80 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం

ఆ క్లిప్స్‌లోని కంటెంట్‌తో పాటు మేకింగ్ స్టైల్ వారికి బాగా నచ్చడంతో కేవలం 20 నిమిషాల్లోనే డీల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వివరించారు. ఈ సినిమా ఓటీటీ హక్కులు సుమారు రూ.80 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. గతంలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్-హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రానికి సంబంధించిన బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమైనట్లు సమాచారం.

Advertisement