Page Loader
Tollywood : డ్యూడ్‌తో మైత్రీకి భారీ ప్రాఫిట్.. నెట్‌ఫ్లిక్స్ డీల్‌తో లాభాల్లోకి ఎంట్రీ!
డ్యూడ్‌తో మైత్రీకి భారీ ప్రాఫిట్.. నెట్‌ఫ్లిక్స్ డీల్‌తో లాభాల్లోకి ఎంట్రీ!

Tollywood : డ్యూడ్‌తో మైత్రీకి భారీ ప్రాఫిట్.. నెట్‌ఫ్లిక్స్ డీల్‌తో లాభాల్లోకి ఎంట్రీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 07, 2025
11:49 am

ఈ వార్తాకథనం ఏంటి

లవ్ టుడే సినిమాతో దర్శకుడిగా నుంచి హీరోగా మారిన ప్రదీప్ రంగనాథ్ తొలి సినిమాతోనే హిట్ అందుకుని సత్తా చాటాడు. తన రెండో సినిమా 'డ్రాగన్'తో వంద కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టి హీరోగా నిరూపించుకున్నాడు. ఈ విజయాలతో ప్రదీప్‌కు ఆఫర్స్ వరుసగా వస్తున్నాయి. ప్రస్తుతం 'లవ్ ఇన్సురెన్స్ కంపెనీ', అలాగే మరో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'డ్యూడ్' చిత్రాల్లో నటిస్తున్నాడు. 'డ్యూడ్' సినిమాను టాలీవుడ్‌ బడా సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, ఈ చిత్రం సుధా కొంగర వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన కీర్తిశ్వరన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మేకర్స్‌కు భారీ లాభాలను తేలిగ్గా తెచ్చిపెట్టింది.

Details

రూ.25 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం

డ్యూడ్‌ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ రూ. 25 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం. రూ. 20-25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కేవలం డిజిటల్ రైట్స్‌ డీల్‌ ద్వారా ప్రాఫిట్ జోన్‌లోకి ఎంటర్‌ అయిపోయింది. ఇంకా శాటిలైట్, మ్యూజిక్ రైట్స్ వంటి వాటి నుంచి వచ్చే ఆదాయం మిగిలే ఉంది. థియేటర్లలో హిట్ టాక్ వస్తే, దానితో వచ్చే లాభం మైత్రీ మూవీ మేకర్స్‌కి మరింత బంపరే. ఈ దశలోనే టేబుల్ ప్రాఫిట్ సాధించిన ఈ సినిమాతో మైత్రీకి జాక్‌పాట్ తగిలిందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న 'డ్యూడ్' ఈ ఏడాది దీపావళికి థియేటర్లలో విడుదల కానుంది.