CM Vijay : విజయ్‌కు భారీ ఊరట.. విడాకుల పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న సంగీత!
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్‌కు న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. ఆయన సతీమణి సంగీత దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకోవడంతో ఈ సుదీర్ఘ న్యాయ వివాదానికి తాత్కాలికంగా తెరపడింది. చెంగల్పట్టులోని కుటుంబ సంక్షేమ కోర్టులో విచారణలో ఉన్న ఈ కేసును సంగీత వెనక్కి తీసుకోవడంతో, న్యాయమూర్తి కేసును పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
వివరాలు
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరు
గతంలో 2025 డిసెంబర్ 5న సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విజయ్‌తో విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
తాజా విచారణకు సంగీత వ్యక్తిగతంగా హాజరుకాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తాను దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు న్యాయస్థానానికి తెలియజేశారు.
కేసు అధికారికంగా ముగిసింది
సంగీత నిర్ణయంపై విజయ్ తరఫు న్యాయవాదులు కూడా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు.
దీంతో ఇరు పక్షాల సమ్మతిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు, ఈ విడాకుల కేసును అధికారికంగా క్లోజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో విజయ్‌కు ఈ కేసులో పెద్ద ఊరట లభించినట్టైంది.