Page Loader
Vishwambhara Movie: విశ్వంభర కోసం రామోజీ ఫిలిం సిటీ లో భారీ సెట్ 
Vishwambhara Movie: విశ్వంభర కోసం రామోజీ ఫిలిం సిటీ లో భారీ సెట్

Vishwambhara Movie: విశ్వంభర కోసం రామోజీ ఫిలిం సిటీ లో భారీ సెట్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 12, 2024
11:59 am

ఈ వార్తాకథనం ఏంటి

మెగాస్టార్ చిరంజీవి,కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తున్న సినిమా 'విశ్వంభర'. ఈ చిత్రానికి బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే, ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుపుకుంటున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ షూటింగ్ సంబంధించి ఓ సూపర్ డూపర్ న్యూస్ ఒకటి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.

Details 

రూ. 200 కోట్లతో బ‌డ్జెట్‌తో విశ్వంభర 

హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీ లో ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం భారీ సెట్ ను వేస్తున్నట్లు సమాచారం. ఈ ఫైట్ సీక్వెన్స్‌లో మెగాస్టార్ గెటప్ అద్భుతంగా ఉంటుంద‌ని అంటున్నారు. ఈ యాక్షన్ విజువల్స్‌గా కూడా గూస్‌బంప్స్ తెప్పించనున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఈ విషయం గనుక నిజం అయితే మెగా ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పాలి. ఇక ఈ మూవీని యువీ క్రియేషన్స్ సంస్థ సుమారు రూ. 200 కోట్లతో బ‌డ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తుంది.