LOADING...
Bollywood : మరోసారి పవర్‌ఫుల్‌ రోల్‌లో దుమ్మురేపేందుకు సిద్ధమైన హ్యూమా ఖురేషీ
మరోసారి పవర్‌ఫుల్‌ రోల్‌లో దుమ్మురేపేందుకు సిద్ధమైన హ్యూమా ఖురేషీ

Bollywood : మరోసారి పవర్‌ఫుల్‌ రోల్‌లో దుమ్మురేపేందుకు సిద్ధమైన హ్యూమా ఖురేషీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 26, 2025
09:25 am

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్‌ వర్సటైల్‌ నటి హ్యూమా ఖురేషీ తన ప్రత్యేకమైన క్యారెక్టరైజేషన్‌, విభిన్నమైన రోల్స్‌ ఎంపికతో సినీ ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. గ్యాంగ్స్ ఆఫ్ వసిపూర్తో కెరీర్‌ను ప్రారంభించిన ఈ బ్యూటీ, వరుస విజయాలతో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టి తక్కువ కాలంలోనే టాలెంటెడ్‌ స్టార్‌గా ఎదిగింది. బద్లాపూర్, జాలీ ఎల్ఎల్బీ 2, మోనికా ఓ మై డార్లింగ్ వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న హ్యూమాకు అసలు క్రేజ్‌ను తెచ్చిపెట్టినది మహారాణి వెబ్‌ సిరీస్‌. ఈ పొలిటికల్‌ థ్రిల్లర్‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పటికే మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి కాగా, ఇప్పుడు నాలుగో సీజన్‌ రాబోతోంది.

Details

నవంబర్ 7న స్ట్రీమింగ్

దర్శకుడు పునీత్‌ ప్రకాష్‌ రూపొందిస్తున్న మహారాణిలో ఓ సాధారణ మహిళ సీఎం ఎలా అయ్యిందన్నదే కథాంశం. హ్యూమా ఇందులో రాణి భారతి పాత్రలో పవర్‌ఫుల్‌ లీడర్‌గా మెరవబోతోంది. బిహార్‌ ప్రజల క్షేమం కోసం ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికైనా వెనుకాడని ధైర్యవంతురాలిగా ఆమె కనిపించనుంది. నవంబర్‌ 7 నుండి సోనీ లివ్‌లో మహారాణి సీజన్‌ 4 స్ట్రీమింగ్‌ కానుంది. అంతేకాక, హ్యూమా డెల్హీ క్రైమ్‌ సీజన్‌ 3లో కూడా నటిస్తోంది. ఈ సిరీస్‌ నవంబర్‌ 13న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. ఇటీవలి కాలంలో హ్యూమా ఓటీటీ ప్రాజెక్టులతో బిజీగా ఉంటూ, థియేటర్‌ సినిమాల్లో మాత్రం అంతగా సక్సెస్‌ సాధించలేకపోతోంది.

Details

మరో హిట్ కోసం ఎదురుచూపు

ఈ ఏడాది ఆమె చేసిన మాలిక్ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ పెద్దగా ఫలితం ఇవ్వలేదు. అలాగే జాలీ ఎల్ఎల్బీ 3లో చేసిన పాత్ర కూడా ఆశించిన స్థాయిలో నిలవలేదు. అయితే ఇవి ఆమె కెరీర్‌కు మైనస్‌ కాకపోయినా, ప్లస్‌ కూడా కాలేదు. ప్రస్తుతం హ్యూమా నటించిన పూజా మేరీ జాన్, గులాబీ, సింగిల్‌ సల్మా చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే పూర్తి చేసిన బయాన్ సినిమా కూడా రిలీజ్‌ కోసం వేచి ఉంది. ఈ క్రమంలో హ్యూమా ఖురేషీ కన్నడ చిత్ర పరిశ్రమలో టాక్సిక్ సినిమా ద్వారా లాంచ్‌ అవుతోంది. మొత్తం మీద ఆమె లైనప్‌ బలంగా ఉండగా, ఇప్పుడు మేడమ్‌ ఖాతాలో ఓ బంపర్‌ హిట్‌ పడటమే మిగిలింది.