LOADING...
Pavala Shyamala: అనారోగ్యంతో ఇబ్బందులు.. అనాథాశ్రమానికి చేరిన నటి పావలా శ్యామల
అనారోగ్యంతో ఇబ్బందులు.. అనాథాశ్రమానికి చేరిన నటి పావలా శ్యామల

Pavala Shyamala: అనారోగ్యంతో ఇబ్బందులు.. అనాథాశ్రమానికి చేరిన నటి పావలా శ్యామల

వ్రాసిన వారు Moogati Shabari
Jul 11, 2026
11:41 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు సినీ నటి పావలా శ్యామల దయనీయ పరిస్థితుల్లో హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రి ప్రాంగణంలో కనిపించారు. గురువారం ఉదయం గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ఆమెతో పాటు కుమార్తె మాధవిని ఎర్రగడ్డ ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రి వద్ద వదిలివెళ్లినట్లు సమాచారం. ఆసుపత్రి సిబ్బంది పావలా శ్యామలను గుర్తించి వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్‌కుమార్ ఆదేశాల మేరకు వైద్య బృందం తల్లి, కుమార్తె ఇద్దరికీ క్షయవ్యాధి (టీబీ) నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది. పరీక్షల్లో వారికి టీబీ లేదని తేలింది. అయితే ఇతర ఆరోగ్య సమస్యలు గుర్తించడంతో మరింత చికిత్స కోసం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు.

వివరాలు

అనాథాశ్రమానికి సురక్షితంగా తరలింపు..

ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యులు వారిని పరీక్షించి చికిత్స కోసం చేర్చుకున్నారు. అయితే అక్కడ ఉండేందుకు తమకు ఇబ్బందిగా ఉందని చెప్పిన పావలా శ్యామల, ఆమె కుమార్తె అదే రోజు సాయంత్రానికి తిరిగి ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రికి చేరుకున్నారు. దీంతో ఆసుపత్రి అధికారులు వారిని మళ్లీ ఆసుపత్రిలో చేర్చుకుని బోరబండ పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం శుక్రవారం పోలీసుల పర్యవేక్షణలో పావలా శ్యామలతో పాటు ఆమె కుమార్తెను నగరంలోని ఒక అనాథాశ్రమానికి సురక్షితంగా తరలించారు.

Advertisement