Loading...
Deepika Padukone: ఆ 'హీరో కంటే నాకే ఎక్కువ అర్హత'.. రెమ్యునరేషన్ పై దీపికా పదుకొనే సంచలనం!
ఆ 'హీరో కంటే నాకే ఎక్కువ అర్హత'.. రెమ్యునరేషన్ పై దీపికా పదుకొనే సంచలనం!

Deepika Padukone: ఆ 'హీరో కంటే నాకే ఎక్కువ అర్హత'.. రెమ్యునరేషన్ పై దీపికా పదుకొనే సంచలనం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 28, 2026
05:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే సినీ పరిశ్రమలో నటీనటుల మధ్య ఉన్న పారితోషిక వ్యత్యాసంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ ఎంత విజయవంతమైనా.. హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ దక్కకపోవడంపై ఆమె కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. ఈ సందర్భంగా ఇటీవల తనకు ఎదురైన ఓ సంఘటనను దీపికా ఇంటర్వ్యూలో వివరించారు. ఒక సినిమాలో మేల్ స్టార్‌కు (హీరోకు) ఓ ఫిక్స్‌డ్ రేట్‌తో రెమ్యునరేషన్ లాక్ చేశారు. ఆ హీరోకు ఎంత ఇస్తున్నారో నాకు తెలిసింది. నా వర్క్ ఎక్స్‌పీరియన్స్, నేను చేసిన సినిమాల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే.. ఆ హీరో కంటే నేనే ఎక్కువ సక్సెస్‌ఫుల్ అని నాకనిపించింది.

వివరాలు

అదే స్థాయిలో రెమ్యునేషన్ కావాలని డిమాండ్ చేశా

అందుకే నాకు కూడా అదే స్థాయి రెమ్యునరేషన్ కావాలని డిమాండ్ చేశానని దీపికా చెప్పారు.

అయితే తాను రెమ్యునరేషన్ గురించి మాట్లాడినప్పుడు నిర్మాతల నుంచి భిన్నమైన స్పందన వచ్చిందని ఆమె తెలిపారు.

"మా దగ్గర అంత బడ్జెట్ లేదు. సినిమాకు హీరో అవసరం. కాబట్టి మేం అతనికి అంత ఇస్తున్నాం.. నీకు ఇవ్వగలిగింది ఇంతే" అని నిర్మాతలు తనతో చెప్పినట్లు దీపికా వెల్లడించారు.

దీనికి తాను కూడా స్పష్టమైన సమాధానం ఇచ్చానని చెప్పారు. "సరే.. మీకైతే ఓ దండం. నాకైతే ఇంట్రెస్ట్ లేదు" అని చెప్పి ఆ సినిమాను వదిలేసినట్లు దీపికా కుండబద్దలు కొట్టారు.

అయితే ఆ సినిమా పేరు ఏంటని ఇంటర్వ్యూయర్ అడిగినప్పటికీ.. ఆమె నవ్వుతూ ఆ ప్రశ్నను దాటవేశారు.

వివరాలు

మహిళలు ఎందుకు అడగలేకపోతున్నారు?

మహిళలు తమ పారితోషికం గురించి మాట్లాడేందుకు ఎందుకు వెనుకాడుతున్నారనే ప్రశ్నకు కూడా దీపికా సూటిగా సమాధానం ఇచ్చారు.

రెమ్యునరేషన్ కోసం పట్టుబడితే ఎక్కడ మంచి అవకాశాలను కోల్పోతామో అనే భయం మహిళల్లో ఎక్కువగా ఉంటుందని ఆమె అన్నారు.

మన రెమ్యునరేషన్ కోసం పట్టుబడితే ఎక్కడ మంచి అవకాశాలు కోల్పోతామో అన్న భయం మహిళల్లో ఎక్కువగా ఉంటుంది.

ఆ భయం వల్లే చాలా మంది అడగలేకపోతున్నారు. కానీ ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు ధైర్యంగా ముందుకు వచ్చి దీని గురించి ప్రశ్నించాల్సిందేనని దీపికా పదుకొనే స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే.. దీపికా పదుకొనే పాన్ ఇండియా మూవీ 'స్పిరిట్' నుంచి తప్పుకున్నారని, ఆమెను తప్పించారని ఇప్పటికే రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.

ADVERTISEMENT