Keerthy Suresh: నేను ఆ సినిమా చేయడం లేదు.. రూమర్లపై క్లారిటీ ఇచ్చేసిన కీర్తి సురేష్
ఈ వార్తాకథనం ఏంటి
సౌత్ ఇండియన్ స్టార్ నటి కీర్తి సురేష్ చాలాకాలం తర్వాత మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆమె చివరిగా నటించిన పెద్ద తెలుగు సినిమా మెగాస్టార్ చిరంజీవితో చేసిన 'భోళా శంకర్'. ఆ తర్వాత 2025లో సుహాస్‌తో చేసిన ఉప్పు కప్పురంబు విడుదలైనప్పటికీ, ఆ చిత్రం వచ్చిన సంగతే చాలా మందికి తెలియకుండా పోయింది. అవకాశాలు తగ్గాయా? లేక ఆమెకే ఆసక్తి తగ్గిందా? అనేది స్పష్టంగా తెలియకపోయినా, కీర్తి సురేష్ కొంతకాలంగా తెలుగు సినిమాల్లో కనిపించలేదు. దాదాపు విరామం తర్వాత కీర్తి సురేష్ నటిస్తున్న తాజా చిత్రం 'రివాల్వర్ రీటా'. దర్శకుడు చంద్రు రూపొందించిన ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ తెలుగులో కూడా విడుదల కానుంది.
Details
ఎల్లమ్మ సినిమా చేయడం లేదు
డైరెక్ట్ తెలుగు సినిమాతో కాకుండా, డబ్బింగ్ వెర్షన్‌తో తెలుగువారిని ఆకట్టుకోవడానికి కీర్తి సిద్ధమవుతోంది. తాజాగా రివాల్వర్ రీటా ప్రమోషన్ కోసం తెలుగులో ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంలో సినిమా వివరాలతో పాటు రాబోయే ప్రాజెక్టుల గురించి కూడా కీర్తి సురేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఒక రిపోర్టర్ చాలా కాలంగా ప్రచారంలో ఉన్న 'ఎల్లమ్మ' సినిమా గురించి ప్రశ్నించాడు. 'ఎల్లమ్మ సినిమాలో హీరోయిన్‌గా మీరు నటిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయం నిజమేనా? అని అడిగాడు. దీనికి కీర్తి స్పష్టంగా స్పందిస్తూ లేదు... నేను 'ఎల్లమ్మ' సినిమా చేయడం లేదని స్పష్టం చేసింది.
Details
హీరో విషయంలో స్పష్టత లేదు
'ఎల్లమ్మ' చిత్రానికి కేవలం హీరోయిన్ ఎంపికలోనే కాదు, హీరో విషయంలో కూడా ఇప్పటివరకు స్పష్టత రాలేదు. నాని, శర్వానంద్, నితిన్, బెల్లంకొండ శ్రీనివాస్ వంటి పలువురు నటుల పేర్లు వినిపించగా, తాజాగా సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ పేరు కూడా చర్చలోకి వచ్చింది. అయినప్పటికీ, ఈ ప్రాజెక్ట్‌లో నిజంగా ఎవరు హీరోగా నటిస్తారు, ఎవరు హీరోయిన్‌గా ఉంటారు అన్నది ఇంకా తెలియరాలేదు. హీరోయిన్‌గా కీర్తి సురేష్ లేదన్న సంగతి మాత్రం స్పష్టమైంది. ఇక ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది? నటీనటుల అధికారిక జాబితా ఎప్పుడెప్పుడు బయటకు వస్తుంది? అనేదానిపై మేకర్స్ నుంచి ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.