Page Loader
Nara Rohit: 'నాన్నా మీతో జీవితం మరచిపోలేను'.. ట్విట్టర్‌లో‌ నారా రోహిత్ ఎమోషనల్ పోస్ట్
నాన్నా మీతో జీవితం మరచిపోలేను'.. ట్విట్టర్‌లో‌ నారా రోహిత్ ఎమోషనల్ పోస్ట్

Nara Rohit: 'నాన్నా మీతో జీవితం మరచిపోలేను'.. ట్విట్టర్‌లో‌ నారా రోహిత్ ఎమోషనల్ పోస్ట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 17, 2024
12:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ తండ్రి, చంద్రగిరి మాజీ శాసనసభ్యులు నారా రామ్మూర్తి నాయుడు శనివారం కన్నుమూశారు. నారా రామ్మూర్తి నాయుడు అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు ఇవాళ నారావారిపల్లెలో మధ్యాహ్నం నిర్వహించనున్నారు. తండ్రిని కోల్పోయిన నారా రోహిత్, తన ఎక్స్ ఖాతాలో ఎమోషనల్‌గా పోస్టు చేశారు. నాన్నా, ఎన్నో త్యాగాలు చేశారని, ప్రేమించటం, జీవితాన్ని ఎలా గెలవాలో తనకు నేర్పించారన్నారు. ఈ రోజు తాను ఈ స్థాయిలో ఉన్నా అంటే, దానికి నాన్నే అని చెప్పారు.

Details

ఇవాళ నారావారిపల్లెలో అంత్యక్రియలు

ప్రజలను ప్రేమిస్తూ మంచి కోసం పోరాడాలని ఎప్పుడూ చెబుతుండేవాడని, ఇక జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనప్పటికీ, అవి తన దగ్గరికి రాకుండా ఎంతో ప్రేమగా పెంచారని తెలిపారు. నాన్న జ్ఞాపకాలు ఎప్పటికి తనతో ఉంటాయని, బై నాన్నా అంటూ తన తండ్రితో చిన్నప్పటి ఫోటోను జత చేసి ఎక్స్‌లో పోస్టు చేశాడు. నారా రామ్మూర్తి నాయుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకు సోదరుడు కాగా, తెలుగు దేశం పార్టీలో ఆయన వివిధ రాజకీయ పదవులు చేపట్టారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పోస్టు చేసిన నారా రోహిత్