Page Loader
Allu Arjun: సుకుమార్ లేకుండా నా కెరీర్ ఊహించుకోలేను.. అల్లు అర్జున్ ఎమోషనల్ స్పీచ్
సుకుమార్ లేకుండా నా కెరీర్ ఊహించుకోలేను.. అల్లు అర్జున్ ఎమోషనల్ స్పీచ్

Allu Arjun: సుకుమార్ లేకుండా నా కెరీర్ ఊహించుకోలేను.. అల్లు అర్జున్ ఎమోషనల్ స్పీచ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 09, 2025
09:11 am

ఈ వార్తాకథనం ఏంటి

'పుష్ప 2' మూవీ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రూపొందించిన ఈ భారీ చిత్రం గత ఏడాది డిసెంబర్ 5న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైంది. 'పుష్ప' బ్లాక్‌బస్టర్‌కు సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి. ఈ కారణంగా విడుదలైన మొదటి షో నుంచే బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకుపోయి, ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ సంచలన విజయాన్ని సాధించింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ ఇటీవల థాంక్యూ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో అల్లు అర్జున్ భావోద్వేగంతో మాట్లాడాడు. ఈ సినిమా కోసం 5 నిమిషాల నుంచి 5 సంవత్సరాల వరకు శ్రమించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలన్నారు.

Details

సుకుమార్ అంటే ఎమోషన్

తన కెరీర్‌ను చూస్తే సుకుమార్ లేకుండా ఊహించుకోవడం అసాధ్యమన్నారు. గత అయిదేళ్లుగా సుకుమార్‌ను పిచ్చోడిలా ఫాలో అయ్యానని, మూడో భాగం గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేనని, కానీ దేవుడి దయ ఉంటే 'అల్లు ఆర్మీ' మరింత గర్వపడేలా చేస్తానని అల్లు అర్జున్ పేర్కొన్నారు. ఈ మూవీ పాటలకు మిలియన్ల వ్యూస్ వచ్చినా స‌రిపోతుందనుకున్నామని, కానీ దేవిశ్రీ ప్రసాద్ బిలియన్ల రికార్డులు చూపించారని కొనియాడారు. అలాగే సరైన గైడెన్స్ లేకపోతే మంచి నటుడే బ్యాడ్ యాక్టర్‌గా మారే ప్రమాదం ఉంటుందని, కానీ సుకుమార్ వల్లనే ఈ స్థాయిలో ఉన్నానని, ఆయన పర్సన్ కాదని, ఎమోషన్ అంటూ అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు.