Deepika Padukone: ఒత్తిడితో పని చేయలేను… నా శరీరం, నా కుటుంబమే ముఖ్యం : దీపికా పదుకొణె
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఇటీవల చేసిన వ్యాఖ్యలు మరోసారి ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారి తీశాయి. రోజుకు కేవలం 8 గంటలు పని చేస్తాననే షరతుపై ఆమె నిలబడటం, దాని వల్ల కొన్ని కీలక ప్రాజెక్టులు కోల్పోవడం ఇప్పటికీ హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఈ షరతు కారణంగా ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న రెండు భారీ ప్రాజెక్టులైన 'కల్కి 2', 'స్పిరిట్' చిత్రాల నుంచి దీపికా తప్పుకోవాల్సి వచ్చింది. మేకర్స్ అధికారికంగా ఆమెను ప్రాజెక్ట్ నుంచి తప్పించినట్లు ప్రకటించడంతో ఈ వివాదం ముగిసిందనుకున్నారు. అయితే, ఈ విషయం తాజాగా మళ్లీ వైరల్ అవుతోంది.
Details
మళ్లీ స్పందించిన దీపికా
ఈ విషయం పై తన తాజా ఇంటర్వ్యూలో దీపికా మరోసారి స్పష్టమైన సమాధానం ఇచ్చింది. ఇప్పుడు నేనో తల్లి. బిడ్డ పుట్టిన తర్వాత మా అమ్మను చూసే గౌరవం మరింత పెరిగింది. వృత్తి జీవితాన్ని, పిల్లల పెంపకాన్ని సమతుల్యం చేయడం ఎంత కష్టమో ఇప్పుడు అర్థమైందని చెప్పింది. కొత్తగా డెలివరీ అయిన మహిళలు తిరిగి వర్క్‌లో చేరినప్పుడు వారికి సపోర్ట్ చాలా అవసరం. రోజుకు 8 గంటలకంటే ఎక్కువ పని చేయడం శరీరానికీ, మనసుకీ మంచిది కాదు. ఆరోగ్యంగా ఉంటేనే పని అవుట్‌పుట్ మెరుగ్గా ఉంటుంది.
Details
రోజుకు 8 గంటలే పని చేయాలి
ఒత్తిడితో పనిచేయడం తప్పు అని అమె స్పష్టం చేసింది. అంతేకాదు తన సంస్థలో కూడా ఇదే నియమం అమలులో ఉందని వివరించింది. మా ఆఫీసులో కూడా కేవలం 8 గంటలే పని చేస్తాం. టైమ్ అనేది మన సంపద. దాన్ని ఎవరితో, ఎలా వినియోగించాలో నిర్ణయించే హక్కు నాకు ఉంది. నిజమైన విజయమంటే ఇదే. ఇప్పటికీ చెబుతున్నా—రోజుకు 8 గంటలే పని చేయాలనే నా నిర్ణయం పూర్తిగా కరెక్ట్ అని ఆమె మళ్లీ తేల్చి చెప్పింది. దీపికా ప్రస్తుతం షారుక్ ఖాన్‌తో కలిసి 'కింగ్' సినిమాలో నటిస్తోంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఇటీవల విడుదలైన టీజర్ విపరీతమైన హైప్ క్రియేట్ చేసింది. వచ్చే ఏడాదిలో సినిమా విడుదల కానుంది.