Peddhi trailer: 'నేను ఆడలేదు.. పోరాడాను సారు'.. 'పెద్ది' ట్రైలర్‌కు ఫ్యాన్స్ ఫిదా
ఈ వార్తాకథనం ఏంటి
'మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు.. నేను పోరాడాను సారు..' అంటూ రామ్ చరణ్ చెప్పే డైలాగ్‌తో 'పెద్ది' ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచుతోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో రామ్‌చరణ్ కథానాయకుడిగా నటిస్తుండగా, జాన్వీ కపూర్ కథానాయికగా కనిపించనున్నారు. వెంకట సతీశ్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీ జూన్ 4న తెలుగు సహా పలు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
వివరాలు
ముంబైలో ట్రైలర్ విడుదల
చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం ముంబయిలో ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌లో రామ్‌చరణ్ నటన, యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుండగా, దర్శకుడు బుచ్చిబాబు సానా టేకింగ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. స్పోర్ట్స్, ఎమోషన్, మాస్ యాక్షన్ అంశాలతో రూపొందిన ఈ చిత్రం థియేటర్లలో భారీ స్థాయిలో సందడి చేయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.