 
                                                                                Madonna Sebastian: నేనేం చేస్తున్నానో నాకు తెలుసు.. అందులో తప్పేమీ లేదు : మలయాళ బ్యూటీ
ఈ వార్తాకథనం ఏంటి
మలయాళ బ్యూటీ మడోనా సెబాస్టియన్ గురించి ఎక్కువ పరిచయం అవసరం లేదు. ఈ నటి ప్రధానంగా మలయాళ, తమిళ సినిమాల్లో తన కాంతిని చూపించుకుంది. అయితే మలయాళ బ్లాక్‌బస్టర్ సినిమా 'ప్రేమమ్' చూసిన ప్రేక్షకులు మాత్రం మడోనాను సులభంగా మరవలేరు. తెలుగులో కూడా ఆమె రెండు సినిమాల్లో నటించింది. ఒకటి ప్రేమమ్ రీమేక్, మరొకటి నాని హీరోగా వచ్చిన శ్యామ్ సింగరాయ్. ఈ రెండు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ, ఆమెకు ప్రాక్టికల్ గా ఎక్కువ అవకాశాలు లభించలేదు. . మడోనా సెబాస్టియన్ గ్లామర్ షోకు ఎక్కువగా దూరంగా ఉండే నటి. అయితే ఇటీవల సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఫోటో ఒక్కసారిగా ఫ్యాన్స్‌ను షాక్‌లోకి నెట్టింది.
Details
కౌంటర్ ఇచ్చిన నటి
పొట్టి బట్టలు ధరిచి స్కిన్ షోతో గ్లామర్ ప్రదర్శిస్తూ రచ్చ సృష్టించింది.దీంతో కొంతమంది సోషల్ మీడియా ద్వారా ఆమెను ట్యాగ్ చేస్తూ దారుణమైన కామెంట్స్ కూడా పెట్టారు. ఈ ఫీడ్‌బ్యాక్ మడోనా వరకు చేరడంతో, ఆమె కూడా స్పందించాల్సి వచ్చింది.మడోనా తన సోషల్ మీడియా పోస్టులో ఇలా రిప్లై ఇచ్చింది. గ్లామర్ షో తప్పేమీ కాదు. కానీ, గ్లామర్ అసభ్యత మధ్య తేడా తెలుసుకుంటే చాలు. నాకు ఏమి చేయాలో నేను తెలుసనని స్పష్టం చేసింది. మొత్తానికి, ఈ ఒక్క ఫోటోతోనే మడోనా స్కిన్ షో కోసం సిద్ధంగా ఉన్నారని, గ్లామర్ వైపు కూడా తన దృష్టిని ప్రకటించింది. ఇకనైనా ఆమెకు వరుస అవకాశాలు వస్తాయా అనే అంశం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.