LOADING...
Govinda: నేను బాగానే ఉన్నా.. ఆస్ప్రతి నుంచి గోవిందా డిశ్చార్జ్

Govinda: నేను బాగానే ఉన్నా.. ఆస్ప్రతి నుంచి గోవిందా డిశ్చార్జ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 12, 2025
03:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

తాను పూర్తిగా క్షేమంగా ఉన్నానని బాలీవుడ్‌ ప్రముఖ నటుడు గోవిందా (Govinda) స్పష్టం చేశారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, 'నేను బాగానే ఉన్నాను. క్రమం తప్పకుండా చేసే వర్కౌట్లను ఎక్కువగా చేయడం వల్ల కొంత అలసటకు గురయ్యాను. శరీరానికి ఆరోగ్యకరమైనది యోగా, ప్రాణాయామం లాంటివి అని ఇప్పుడు మరింత స్పష్టంగా అర్థమైందని అన్నారు. తన ఆరోగ్య సమస్యపై స్పందించిన ఆయన స్నేహితుడు, న్యాయవాది బిందాల్‌ మాట్లాడుతూ గత నెల రోజులుగా గోవిందా చాలా బిజీగా ఉన్నారు. షూటింగ్స్‌, మీటింగ్స్‌ వల్ల శరీరానికి తగిన విశ్రాంతి దొరకలేదు.

Details

గోవిందాకు విశ్రాంతి అవసరం

అందుకే ఈ పరిస్థితి ఎదురైంది. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన క్షేమంగా ఇంటికి చేరుకున్నారని తెలిపారు. గత మంగళవారం అర్థరాత్రి గోవిందా అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడంతో ఆయనను జుహులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యుల పర్యవేక్షణలో కొన్ని గంటల పాటు చికిత్స పొందిన అనంతరం డిశ్చార్జి అయ్యారు. వైద్యులు పూర్తిగా కోలుకునే వరకు ఒత్తిడిని తగ్గించి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.