
Srinidhi Shetty : నానితో స్క్రీన్ షేర్ అంటేనే ఓకే చెప్పేశా : శ్రీనిధి శెట్టి
ఈ వార్తాకథనం ఏంటి
'కేజీఎఫ్'తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన శ్రీనిధి శెట్టి, తొలి సినిమాతోనే స్టార్‌డమ్ అందుకున్నా... తర్వాతి కెరీర్ మాత్రం అంచనాలకు తగ్గట్టుగా సాగలేదు.
యష్ లాంటి స్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆమె, తర్వాత చేసిన 'కోబ్రా' వంటి సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.
అయినా సరే ఆ ఫెయిల్యూర్స్‌తో వెనక్కి తగ్గకుండా.. ఇప్పుడు టాలీవుడ్‌లో తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమైంది.
ప్రస్తుతం నాని హీరోగా నటిస్తున్న 'హిట్ 3' చిత్రంలో శ్రీనిధి హీరోయిన్‌గా నటిస్తోంది. మే 1న విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీనిధి, ఈ సినిమా ఆఫర్‌కి తాను ఎందుకు వెంటనే ఓకే చెప్పిందో వివరించింది.
Details
నాని అంటేనే ఓ బ్రాండ్
హిట్ 3 స్క్రిప్ట్ నా వద్దకు వచ్చిన వెంటనే ఆలోచించకుండా అంగీకరించా. నాని అంటే ఓ బ్రాండ్. ఆయన సినిమాలో ఛాన్స్ వస్తే ప్రశ్నలు అడగకూడదు. ఈ సినిమాలో నేను ఆయన భార్య పాత్రలో కనిపించబోతున్నాను.
ప్రోమోలో ఎక్కువగా కనిపించలేదు కానీ, నా పాత్ర మాత్రం చాలా పవర్‌ఫుల్. ఇది నా కెరీర్‌కు ఒక మంచి మలుపు ఇస్తుందని నమ్మకం ఉందంటూ శ్రీనిధి వెల్లడించింది.
ఇప్పటికే పరిశ్రమలో 'హిట్ 3'పై పాజిటివ్ బజ్ నెలకొంది. ఈ చిత్రం ఆమె కెరీర్‌కు మళ్లీ స్పీడ్ ఇవ్వగలదని అంటున్నారు ట్రేడ్ వర్గాలు.
మరి ఈ అవకాశాన్ని శ్రీనిధి ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి!