Sree leela: నిజాయితీగా ఉన్న వాడే నా జీవిత భాగస్వామి కావాలి.. పెళ్లిపై శ్రీలీల స్పష్టత
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీలీల పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్‌లో కూడా వరుస అవకాశాలు దక్కించుకుంటూ, తన నటనతో, అందంతో అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఆమె దృష్టి మొత్తం పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో నటిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' రవితేజ హీరోగా రూపొందుతున్న 'మాస్ జాతర' సినిమాలపైనే ఉంది. ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నప్పటికీ, శ్రీలీల అప్పుడప్పుడు పలు టెలివిజన్ షో, ఇంటర్వ్యూల్లోనూ పాల్గొంటోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఆమె పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
Details
సినీ కెరీర్ కు పూర్తి మద్దతు ఇవ్వాలి
తనకు కాబోయే భర్త ఎలాంటి వ్యక్తి కావాలనుకుంటుందో ప్రశ్నించగా, శ్రీలీల చాలా స్పష్టంగా సమాధానం ఇచ్చింది. ఆ వ్యక్తి అందంగా ఉండకపోయినా పర్లేదు. కానీ, నా మనసును అర్థం చేసుకునే వ్యక్తి అయి ఉండాలి. నా సినీ కెరీర్‌కు పూర్తి మద్దతు ఇవ్వాలి. నాకు ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు ప్రేమగా, గౌరవంగా చూసుకోవాలి. నాకు సరదాగా తోడుగా ఉండాలి. ముఖ్యంగా నిజాయితీగా ఉండాలని ఆమె చెప్పింది. ఈ లక్షణాలు ఉన్న వ్యక్తిని కలిస్తే తప్పకుండా పెళ్లి చేసుకుంటానని శ్రీలీల చెప్పడంతో, అభిమానులు, నెటిజన్ల మధ్య ఆసక్తికరమైన చర్చ మొదలైంది.
Details
అలాంటి వ్యక్తి దొరుకుతాడంటూ నెటిజన్లు కామెంట్లు
ఇంతటి గుణగణాలు ఉన్న వ్యక్తి ఈ కాలంలో దొరకడం సాధ్యమేనా? అంటూ కొందరు స్పందిస్తున్నారు. మరికొందరు అయితే శ్రీలీల చెప్పిన లక్షణాలు చాలా పాజిటివ్‌గా ఉన్నాయి, ఆమెకు అలాంటి వ్యక్తి తప్పక దొరుకుతాడంటూ కామెంట్లు చేస్తున్నారు. తన కెరీర్, వ్యక్తిగత జీవితం రెండింటినీ సమతుల్యంగా కొనసాగిస్తున్న శ్రీలీల, ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న నాయికల్లో ఒకరుగా నిలిచింది.