Anchor Suma: మోసం చేశారు.. ఆ దర్శకుడిపై కేసు పెట్టాలనుకున్నాను : యాంకర్ సుమ
ఈ వార్తాకథనం ఏంటి
యాంకర్ సుమ—రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. టెలివిజన్ షోలు, సినిమా ఈవెంట్లు, ప్రమోషన్ ఇంటర్వ్యూలతో ఎప్పుడూ బిజీగా గడిపే సుమ.. అలసట అనే మాటే తెలియదు. క్షణం తీరిక లేకుండా పనిచేస్తూ కూడా ఎప్పుడూ ఉత్సాహంగా, చిరునవ్వుతో కనిపిస్తుంది. తాజాగా ఓ సినిమా టీజర్ ఈవెంట్‌లో ఆమె చేసిన సరదా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. బుల్లితెరపై సుమ స్థానం ఎప్పుడూ ప్రత్యేకమే. ఎన్నో ఏళ్లుగా టాప్ యాంకర్‌గా ఉన్న ఆమె టెలివిజన్ మాత్రమే కాకుండా సినిమా ఈవెంట్లను కూడా సొంత శైలిలో నడిపిస్తుంది. ఒకప్పుడు సినిమాలు,సీరియల్స్‌లో నటించిన సుమ.. చాలా కాలంగా యాంకరింగ్‌కే పరిమితమైపోయింది. అయితే ఇప్పుడు మళ్లీ వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది.
Details
కానిస్టేబుల్ పాత్రలో సుమ
చివరిసారిగా 2022లో 'జయమ్మ పంచాయితీ' సినిమాలో నటించిన సుమ.. తాజాగా 'ప్రేమంటే' అనే చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రియదర్శి, ఆనంది జంటగా నటిస్తున్న ఈ సినిమాలో సుమ కానిస్టేబుల్ పాత్రలో కనిపించనుంది. ఈ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆమె తన ప్రత్యేక హాస్యశైలిలో మాట్లాడుతూ అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. "ఎప్పుడూ ప్రోగ్రాం మేమే మొదలుపెడతాం.. కానీ ఈసారి యాంకర్ గీత నా చెక్కు కొట్టేసిందంటూ సరదాగా మొదలుపెట్టిన సుమ, ఈ సినిమాలో నన్ను ప్రియదర్శి పక్కన హీరోయిన్‌గా తీసుకున్నారని చెప్పారు. కానీ దర్శి వయసు నాకంటే తక్కువని చెప్పి దర్శకుడు నవనీత్ అలా చేయలేదు.
Details
మళ్లీ స్క్రీన్‌పై సుమ
చివరికి పవర్‌ఫుల్ కానిస్టేబుల్ పాత్ర అని చెప్పి తీసుకున్నారు. కానీ సీన్ చేశాక పవర్‌ఫుల్ కాదు, పవర్‌లెస్ కానిస్టేబుల్ అని తెలిసింది!" అని నవ్వించింది. అంతేకాకుండా ఇంత మోసం చేస్తారనుకోలేదు. దర్శకుడిపై కేసు వేయాలని అనుకున్నా, కుర్రాడికింకా పెళ్లి కాలేదని వదిలేశా. పెళ్లి చేసుకున్నాకే అతనికి పెద్ద కేసు వస్తుందంటూ హాస్యపూర్వకంగా జోడించింది. గ్లామర్ విషయానికి వస్తే హీరోయిన్ ఆనంది కంటే నేనే ఎక్కువ గ్లామర్‌గా ఉన్నానని చెబుతున్నారు. ఈ సినిమాలో హుక్ స్టెప్ కూడా వేశా అంటూ సుమ తన స్టైల్లో సరదాగా ముగించింది. వెండితెరపై సుమ రీఎంట్రీతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఆమె నటన, కామెడీ టైమింగ్ మళ్లీ స్క్రీన్‌పై ఎలా అలరించబోతుందో చూడాలి.