Loading...
SS Rajamouli: ఒక్క హాలీవుడ్‌ సినిమా అయినా చేస్తా.. 'ఆర్ఆర్ఆర్‌' తర్వాత వచ్చిన ఆఫర్లపై రాజమౌళి కామెంట్స్‌!
ఒక్క హాలీవుడ్‌ సినిమా అయినా చేస్తా.. 'ఆర్ఆర్ఆర్‌' తర్వాత వచ్చిన ఆఫర్లపై రాజమౌళి కామెంట్స్‌!

SS Rajamouli: ఒక్క హాలీవుడ్‌ సినిమా అయినా చేస్తా.. 'ఆర్ఆర్ఆర్‌' తర్వాత వచ్చిన ఆఫర్లపై రాజమౌళి కామెంట్స్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 23, 2026
02:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు చిత్రసీమ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి. 'ఆర్ఆర్ఆర్‌' (RRR) సినిమాతో ఆస్కార్‌ వేదికపై భారతీయ జెండాను ఎగురవేసిన ఆయన.. ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్‌ 'వారణాసి'తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి హాలీవుడ్‌లో సినిమా చేస్తారా? అక్కడి ప్రముఖ నిర్మాణ సంస్థలతో కలిసి పనిచేస్తారా? అనే అంశాలపై అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తి నెలకొంది. తాజాగా బ్రెజిల్‌లో జరిగిన 50వ సావో పాలో అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు రాజమౌళి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక బ్రెజిలియన్‌ మీడియా సంస్థ 'ఒమెలెట్‌'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన హాలీవుడ్‌ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు.

వివరాలు

కనీసం ఒక్క హాలీవుడ్‌ సినిమా అయినా చేయాలనుంది!

అలాగే మహేష్ బాబు, ప్రియాంకా చోప్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తన ప్రతిష్ఠాత్మక చిత్రం 'వారణాసి' (Varanasi) షూటింగ్‌కు సంబంధించి ఆసక్తికరమైన అప్‌డేట్‌ ఇచ్చారు.

ఈ సినిమా చిత్రీకరణకు కేవలం మరో 10 రోజులు మాత్రమే మిగిలి ఉన్నట్లు వెల్లడించారు. హాలీవుడ్‌లో పనిచేయాలనే తన ఆసక్తిని రాజమౌళి ఈ ఇంటర్వ్యూలో స్పష్టంగా వ్యక్తం చేశారు.

అక్కడి వర్కింగ్‌ కల్చర్‌, నెట్‌వర్కింగ్‌, నిర్మాణ వ్యవస్థ గురించి ప్రశంసాపూర్వకంగా మాట్లాడారు. హాలీవుడ్‌ నిర్మాణ సంస్థలతో కలిసి పనిచేయడం ద్వారా ఎంతో నేర్చుకోవచ్చని అభిప్రాయపడ్డారు.

నాకు హాలీవుడ్‌లో కనీసం ఒక సినిమా అయినా చేయాలని ఉంది. అక్కడ ఉండే పక్కా వర్క్‌ ఎథిక్స్‌, పని చేసే విధానం, ప్రొడక్షన్‌ నిర్మాణం నుంచి నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది.

వివరాలు

హాలీవుడ్‌ లో పనిచేయడం నాకెంతో ఇష్టం

హాలీవుడ్‌ ప్రొడక్షన్‌లో పనిచేయడం నాకు ఎంతో ఇష్టమని రాజమౌళి తెలిపారు. దీంతో భవిష్యత్తులో ఆయన హాలీవుడ్‌ ప్రాజెక్ట్‌ చేపట్టే అవకాశాలపై మరోసారి చర్చ మొదలైంది.

అయితే 'ఆర్ఆర్ఆర్‌' తర్వాత హాలీవుడ్‌ నుంచి వచ్చిన అవకాశాలను వెంటనే ఎందుకు అంగీకరించలేదనే విషయాన్ని కూడా ఆయన వివరించారు.

'ఆర్ఆర్ఆర్‌' ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించిన తర్వాత హాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థల నుంచి తనకు అనేక ఆఫర్లు వచ్చాయని వెల్లడించారు.

వాటిలో కొన్ని అవకాశాలు ఇప్పటికీ అందుబాటులోనే ఉన్నాయని తెలిపారు. ఆర్ఆర్ఆర్‌ సమయంలోనే నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ 'వారణాసి' ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో నిమగ్నమయ్యాను.

ఒకేసారి రెండు ప్రాజెక్టులపై నా దృష్టిని కేంద్రీకరించడం సాధ్యం కాలేదు.

ADVERTISEMENT

వివరాలు

'వారణాసి' షూటింగ్‌కు మరో 10 రోజులే!

ఒక పని పూర్తయిన తర్వాతే మరో పని గురించి ఆలోచించడం నా అలవాటు. 'వారణాసి' పూర్తయ్యాక హాలీవుడ్‌ ప్రాజెక్ట్‌ గురించి ఆలోచిస్తాను'' అని రాజమౌళి స్పష్టం చేశారు.

సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు, గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంకా చోప్రా జోనస్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ యాక్షన్‌ అడ్వెంచర్‌ డ్రామా 'వారణాసి'.

ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, ముఖ్యంగా మహేశ్‌ బాబు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రాజమౌళి ఇచ్చిన తాజా అప్‌డేట్‌ ఆసక్తిని పెంచుతోంది.

ఈ ఎపిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ చిత్రానికి సంబంధించిన ప్రధాన షూటింగ్‌ దాదాపు పూర్తయిందని రాజమౌళి ధృవీకరించారు.

ADVERTISEMENT

వివరాలు

మరో 10రోజుల చిత్రీకరణ మాత్రమే ఉంది

కేవలం మరో 10 రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని వెల్లడించారు. దీంతో సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.

భారతీయ ఇతిహాసాలను వెండితెరపై ఆవిష్కరించే విషయంలో గతంలో తాను ఎప్పుడూ పూర్తి సంతృప్తి చెందలేదని రాజమౌళి పేర్కొన్నారు.

అయితే 'వారణాసి'తో తన విజన్‌ను సరికొత్త రీతిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.

భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా భారతీయ ఇతిహాసాలను, తనదైన కథన శైలిని కొత్త కోణంలో ఆవిష్కరించాలనే లక్ష్యంతో ఆయన ఉన్నారు.

ADVERTISEMENT