Ritu Verma: కథ డిమాండ్ చేస్తే ముద్దు సీన్స్ చేస్తా: రీతూ వర్మ
ఈ వార్తాకథనం ఏంటి
'మజాకా'తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి నటి రీతూ వర్మ సిద్ధమవుతున్నారు.
ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఆన్‌స్క్రీన్ ముద్దు సన్నివేశాలకు తాను వ్యతిరేకం కాదని, కథ డిమాండ్ చేస్తే అలాంటి సన్నివేశాల్లో నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు.
ఇప్పటివరకు తనకు అలాంటి అవకాశాలు రాలేదని, అయితే కొంతమంది ముందుగానే ఈ అమ్మాయి ఇలాంటి పాత్రలు చేయదని ఓ నిర్ణయానికి వస్తారన్నారు.
అందుకే అలాంటి కథలు తన వద్దకు రావడం లేదనుకుంటానని రీతూ వర్మ వ్యాఖ్యానించారు.
తన గత చిత్రం 'స్వాగ్' పరాజయంపై స్పందిస్తూ.. 'ఆ సినిమా అందరికీ కాకుండా ఒక ప్రత్యేకమైన ప్రేక్షక వర్గానికి మాత్రమే కనెక్ట్ అయ్యేలా ఉంటుందని తామకు ముందుగానే తెలుసు అని చెప్పారు.
Details
మాజాకా 26న రిలీజ్
కథలోని తీవ్రతను చాలామంది అర్థం చేసుకోలేకపోయారని, అయితే తాను మాత్రం ఒక నటిగా ఆ సినిమాతో పూర్తిగా సంతృప్తిగా ఉన్నానని వివరించారు.
ఇక 'పెళ్లి చూపులు' తన కెరీర్‌లో ప్రత్యేకమైన సినిమా అని, స్నేహితులంతా కలిసి చిన్న బడ్జెట్‌తో ఈ సినిమాను తీశామన్నారు. దాని ఫలితం అలా ఉంటుందని తాము ఊహించలేదన్నారు.
ఆ సినిమా విడుదలైన తర్వాత తమ అందరి జీవితాలను మార్చేసిందన్నారు. విజయ్ దేవరకొండ ఇంత పెద్ద స్టార్ అవుతాడని ముందుగా ఊహించలేకపోయామన్నారు.
అవకాశం వస్తే విజయ్‌తో కలిసి మళ్లీ నటించాలని కోరుకుంటున్నానని రీతూ తెలిపారు.
'మజాకా' చిత్రంలో సందీప్ కిషన్ హీరోగా నటించగా, నక్కిన త్రినాథ్‌రావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 26న విడుదల కానుంది.