LOADING...
Opal Suchata: 'ప్రభాస్‌ మూవీ చూడగానే రివ్యూ ఇస్తా' : ప్రపంచ సుందరి
'ప్రభాస్‌ మూవీ చూడగానే రివ్యూ ఇస్తా' : ప్రపంచ సుందరి

Opal Suchata: 'ప్రభాస్‌ మూవీ చూడగానే రివ్యూ ఇస్తా' : ప్రపంచ సుందరి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 01, 2025
03:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

థాయిలాండ్‌ అందగత్తె ఓపల్ సుచాత (Opal Suchata), 108 దేశాల అందగత్తెలను వెనక్కి నెట్టి మిస్‌ వరల్డ్‌ 2025 కిరీటాన్ని స్వాధీనం చేసుకున్నారు. విజయానంతరం జాతీయ మీడియాతో మాట్లాడిన ఆమె భారతీయ సినిమాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. బాలీవుడ్‌ నటి అలియా భట్‌ (Alia Bhatt) గురించి తెలిసిందని, భారతీయ సినిమాలపై మంచి అభిరుచి ఉన్నట్లు చెప్పారు. ఈ పోటీలో తనకు స్ఫూర్తినిచ్చిన అందగత్తెల గురించి అడిగితే, మానుషి చిల్లర్‌ను ఫైనల్‌లో కలిసినందుకు ఆనందంగా ఉన్నట్లు, ప్రియాంకా చోప్రా నుంచి కూడా స్ఫూర్తి పొందిందని పేర్కొన్నారు. అలియా భట్ నటించిన 'గంగూబాయి కాఠియావాడి' చిత్రాన్ని ఎంతో ఇష్టపడిందని తెలిపారు.

Details

బాహుబలి సినిమాను తప్పకుండా చూస్తా

'బాహుబలి' సినిమా గురించి విన్నప్పటికీ ఇంకా చూడలేదని, మిస్‌ వరల్డ్‌ పోటీల సమయంలో హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శించిన విషయాన్ని వెల్లడించి, త్వరలో ఆ సినిమా చూస్తానన్నారు. ఈ రోజు తన జీవితంలో అద్భుతమైన రోజు అని, థాయ్‌లాండ్‌ ప్రజలకు కూడా ఇది మైలు రాయి అని చెప్పారు. మిస్‌ వరల్డ్‌ స్టేజ్ ద్వారా తమ దేశం గుర్తింపు పొందిన సందర్భంగా ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ ప్రయాణం సులభం కాదని, హృదయానికి దగ్గరైన విజయం సాధించడానికి ప్రతి అడుగు ప్రాముఖ్యత ఉన్నదని పేర్కొన్నారు.