
Salman Khan: ఆయుష్షు ఉన్నంతవరకు జీవిస్తాను.. బెదిరింపులపై ధైర్యంగా స్పందించిన సల్మాన్
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సికందర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
రష్మిక మందన్నా కథానాయికగా నటించిన ఈ సినిమా మార్చి 30న విడుదల కానుంది.
ఈ సందర్భంగా సల్మాన్ ప్రీ-రిలీజ్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా తనకు వచ్చిన బెదిరింపులు, దర్శకుడు అట్లీతో ప్రాజెక్ట్ ఆగిపోయిన విషయంపై స్పందించారు.
Details
అట్లీతో సినిమా ఎందుకు ఆగిపోయిందంటే?
ఇటీవల సల్మాన్ ఖాన్ అట్లీ దర్శకత్వంలో ఓ భారీ సినిమా చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజా ఇంటర్వ్యూలో సల్మాన్ ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ముందుకు సాగడం లేదని స్పష్టం చేశారు.
ఈ సినిమా చేయాలని అనుకున్నామని, ఎన్ని అడ్డంకులు వచ్చినా పరిష్కరించడానికి ప్రయత్నించామన్నారు.. కానీ ప్రాజెక్ట్ పూర్తిగా ముందుకు సాగలేదన్నారు.
బహుశా బడ్జెట్ కారణంగా వాయిదా వేసి ఉండొచ్చని, ఇది భారీ బడ్జెట్ మూవీ అని, అందుకే ప్రాజెక్ట్ నిలిచిపోయిందని ఆయన వివరించారు.
Details
బెదిరింపులపై ఏం చెప్పారంటే
ఇటీవల కాలంలో సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయనకు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసింది.
దీనిపై స్పందించిన ఆయన, తాను దేవుడిని నమ్ముతానని, ఆయనే అన్నీ చూసుకుంటారని చెప్పారు.
తన ఆయుష్షు ఉన్నంతవరకు జీవిస్తానని, భద్రత కూడా చాలా అవసరమేనన్నారు.
ఇక తన సిసిమాతో పాటు రిలీజయ్యే 'L2: ఎంపురాన్' కూడా గొప్ప విజయం సాధిస్తుందని నమ్ముతున్నానని ఆయన తెలిపారు.