LOADING...
Dhruv Vikram: నాన్నలాగే కష్టపడి పనిచేస్తా : ధ్రువ్ విక్రమ్
నాన్నలాగే కష్టపడి పనిచేస్తా : ధ్రువ్ విక్రమ్

Dhruv Vikram: నాన్నలాగే కష్టపడి పనిచేస్తా : ధ్రువ్ విక్రమ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 22, 2025
10:17 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళంలో సంచలన విజయం సాధించిన 'బైసన్' చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో కథానాయకుడు ధ్రువ్ విక్రమ్ మాట్లాడుతూ, సినిమా కోసం తాను చేసిన కష్టాలను వివరించారు. ఈ పాత్ర కోసం సుమారు మూడేళ్లపాటు కఠిన శిక్షణ తీసుకొని, కబడ్డీ ప్రత్యేక శిక్షణలో పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. చిత్రీకరణ సమయంలో అనేక సార్లు గాయపడ్డానని, ఎడమ చేయి విరిగినది, మూడు పళ్లు దెబ్బతిన్నాయని ధ్రువ్ వెల్లడించారు. సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్‌ రావడం ఎంతో ఆనందంగా ఉంది. నా ఉద్దేశ్యం సినిమా నంబర్లకు కాకుండా ప్రేక్షకుల ప్రేమను సంపాదించడం. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా మా నాన్న విక్రమ్ స్టార్ అయ్యారు.

Details

తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతా

నేను కూడా ఆయనలా కష్టపడి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందాలని కోరుకుంటున్నాను. తనకు తెలుగులో డైలాగ్స్ రాసినవారిని 'హాయ్ నాన్న' డైరెక్టర్, తన స్నేహితుడు శౌర్య అని ఆయన పేర్కొన్నారు.కథానాయిక అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ, దర్శకుడు మారి సెల్వరాజ్ దర్శకత్వంలో పనిచేయాలన్న కల ఈ చిత్రంతో నెరవేరిందని తెలిపారు. మారి సెల్వరాజ్ మొదటి సినిమా చూసినప్పటి నుంచే ఆయనతో పనిచేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ధ్రువ్ డెడికేషన్‌ను చూసి నిజంగా ఆశ్చర్యపోయాను. తమిళంలో వచ్చిన అద్భుతమైన స్పందన తెలుగులో కూడా వస్తుందని నమ్ముతున్నానని ఆమె పేర్కొన్నారు.

Details

నవంబర్ 24న రిలీజ్

అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, నీలం స్టూడియోస్ పతాకాలపై పా. రంజిత్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రానికి మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. అర్జున్ అవార్డు గ్రహీత, కబడ్డీ క్రీడాకారుడు మణతి గణేశన్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం, క్రీడా స్ఫూర్తితో పాటు సామాజిక అంశాలను స్పృశిస్తూ రూపొందించారు. తెలుగు ప్రేక్షకుల కోసం ఈ సినిమా నవంబర్ 24న జగదంబే ఫిల్మ్స్ బ్యానర్‌పై విడుదల కానుంది.