Lokesh Kanagaraj: ట్రోల్స్ వచ్చినా వెనక్కి తగ్గను.. లోపాలు సరిదిద్దుకుంటా: లోకేశ్ కనగరాజ్
ఈ వార్తాకథనం ఏంటి
తన గత చిత్రంపై వచ్చిన విమర్శలను స్వీకరిస్తూ, వాటిని భవిష్యత్ సినిమాల్లో సరిదిద్దుకుంటానని దర్శకుడు లోకేశ్ కనగరాజ్ స్పష్టం చేశారు. రజనీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కించిన 'కూలీ' చిత్రం ఈ ఏడాది ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదల అనంతరం వచ్చిన స్పందనపై లోకేశ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. 'కూలీ'పై చాలా విమర్శలు వచ్చాయి. వాటిని నేను తేలికగా తీసుకోలేదు. తర్వాత నేను చేయబోయే సినిమాలో ఆ లోపాలను తప్పకుండా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను. ఎన్నో ట్రోల్స్ వచ్చినప్పటికీ ప్రేక్షకులు రజనీకాంత్ కోసం థియేటర్లకు వచ్చారు. నిర్మాతల మాట ప్రకారం ఈ సినిమా రూ.500 కోట్ల వసూళ్లు సాధించింది. అందుకు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు చెప్పాలని లోకేశ్ అన్నారు.
Details
తదుపరి చిత్రంతో అంచనాలను అందుకుంటా
తాను అంచనాల ఆధారంగా కథలు రాయనని, కథలోని పాత్రలు ప్రేక్షకుల అంచనాలను అందుకుంటే సంతోషమని తెలిపారు. ఒకవేళ అలా జరగకపోతే, తదుపరి చిత్రంలో అయినా ఆ అంచనాలను అందుకునేలా ప్రయత్నిస్తానని చెప్పారు. భారీ తారాగణంతో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ 'కూలీ'లో రజనీకాంత్‌తో పాటు నాగార్జున, శ్రుతి హాసన్, సత్యరాజ్, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్ కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రంలో రజనీ తనదైన శైలిలో అభిమానులను అలరించారు. 'వార్ 2'తో పోటీపడినప్పటికీ ఈ సినిమా రూ.500 కోట్ల కలెక్షన్లు సాధించింది. స్నేహితుడి ఆకస్మిక మరణం వెనుక ఉన్న కారణాలను అన్వేషించే దేవ పాత్రలో రజనీకాంత్ కనిపించారు.