
ఐఫా అవార్డ్స్ 2023: ఉత్తమ నటుడిగా హృతికరోషన్: అవార్డులు గెలుచుకున్నవారి జాబితా ఇదే
ఈ వార్తాకథనం ఏంటి
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిమ్ అవార్డ్స్(ఐఐఎఫ్ఏ) 2023 అవార్డుల ప్రధానోత్సవం శనివారం రాత్రి దుబాయ్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి భారతీయ సినిమా తారలు హాజరయ్యారు.
ఈ అవార్డుల ప్రధానోత్సవంలో ఉత్తమ నటుడిగా హృతిక్ రోషన్ నిలిచారు. విక్రమ్ వేద సినిమాలో నటనకు గాను హృతిక్ రోషన్ అవార్డ్ అందుకున్నాడు.
అలాగే ఉత్తమ నటిగా ఆలియా భట్ అవార్డ్ అందుకుంది. గంగూభాయి కఠియావాడి సినిమాలో నటనకు ఈ పురస్కారం దక్కింది.
ఎవరెవరికి ఏయే అవార్డులు దక్కాయో ఇక్కడ తెలుసుకుందాం.
Details
అవార్డుల జాబితా
ఉత్తమ చిత్రం - దృశ్యం 2
ఉత్తమ దర్శకుడు - ఆర్ మాధవన్(రాకెట్రీ -నంబీ ఎఫెక్ట్)
ఉత్తమ సహాయ నటుడు - అనిల్ కపూర్ (జుగ్ జుగ్ జీయో)
ఉత్తమ సహాయ నటి - మౌనీరాయ్(బ్రహ్మాస్త్ర పార్ట్ 1)
ఉత్తమ తొలి సినిమా నటుడు - శంతను మహేశ్వరి (గంగూభాయ్ కఠియావాడి), బబ్లీ ఖాన్ (ఖాలా)
ఉత్తమ తొలి సినిమా నటి - ఖుషాలీ కుమార్(ధోకా- రౌండ్ డి కార్నర్)
ఉత్తమ గాయకుడు (మేల్)- అరిజిత్ సింగ్ (కేసరియా -బ్రహ్మాస్త్ర పార్ట్ 1)
ఉత్తమ గాయని (ఫీమేల్) - శ్రేయా ఘోషల్ (రాసియా - బ్రహ్మాస్త్ర పార్ట్ 1)
Details
కమల్ హాసన్ కు అవార్డు
ఉత్తమ సంగీత దర్శకుడు - ప్రీతమ్ చక్రవర్తి (బ్రహ్మాస్త్ర పార్ట్ 1)
ఉత్తమ పాటల రచయిత - అమితాబ్ భట్టాచార్య (బ్రహ్మాస్త్ర పార్ట్ 1)
ఉత్తమ కథ - జస్మీత్ కే రీన్, పర్వేజ్ షేక్ (డార్లింగ్స్)
బెస్ట్ స్టోరీ అడాప్టెడ్ - అమేలీ కీయాన్ ఖాన్, అభిషేక్ పాఠక్ (దృశ్యం 2)
ప్రాంతీయ సినిమాకు విశేష్ సేవలందించినందుకు రితేష్ దేశ్ ముఖ్, జెనీలియా(వేద్ సినిమా) లకు అవార్డు వచ్చింది.
భారతీయ సినిమాకు విశేష్ సేవలందించినందుకు గాను కమల్ హాసన్ కు అవార్డు దక్కింది.
ఇంకా భారతీయ సినిమా రంగానికి ఫ్యాషన్ విభగంలో సేవల్ందించినందుకు మనీష్ మల్హోత్రాకు అవార్డు దక్కింది.