
Ilaiyaraaja: మూకాంబిక అమ్మవారికి రూ.4 కోట్ల విలువైన కిరీటం బహూకరించిన ఇళయరాజా
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఉడుపిలోని కొల్లూరు మూకాంబిక అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా,రూ.4కోట్ల విలువ గల వజ్రాలు పొదిగిన వెండి కిరీటాన్ని అమ్మవారికి సమర్పించారు. అంతేకాక,వీరభద్ర స్వామికి వెండి కత్తిని కూడా ఇచ్చారు.పూజా కార్యక్రమాలు పూర్తయ్యాక,ఆలయ అర్చకులు ఇళయరాజాకు తీర్థ ప్రసాదాలు అందించడంతో పాటు,అమ్మవారి ఫొటోను కూడా అందజేశారు. ఇళయరాజా వెంట ఆయన తండ్రి కార్తిక్,మనవడు యతీశ్,ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా ఇళయరాజా మాట్లాడుతూ,"జగన్మాత మూకాంబిక అమ్మవారి ఆశీస్సులే వల్లే ప్రతిదీ సాధ్యమైంది. నా చేతిలో ఏదీ లేదు"అని తెలిపారు. "ఇళయరాజా ఈ ఆలయానికి సాధారణ భక్తుడిగా వస్తారు.2006లో కూడా ఆయన అమ్మవారికి ఒక కిరీటాన్ని సమర్పించారు"అని మూకాంబిక ఆలయం మేనేజ్‌మెంట్ కమిటీ ఛైర్మన్ బాబుశెట్టి చెప్పారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వజ్రాలు పొదిగిన వెండి కిరీటాన్ని అమ్మవారికి సమర్పించిన ఇళయరాజా
#Maestro #ILAIYARAAJA donates Diamond Crowns and Golden Sword to #Karnataka State #Kollur #Mookambika #Temple pic.twitter.com/3Ze0WR8iAU
— Pannaipuram_Official (@Pannaipuram_Off) September 10, 2025