Ilaiyaraaja: ఇళయరాజా కొత్త ఆలోచన.. 15 ఏళ్లలోపు బాలికలకు అరుదైన అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించిన దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా మరోసారి తన హృదయానికి దగ్గరైన నిర్ణయంతో అందరి మనసును గెలుచుకుంటున్నారు. తన కుమార్తె భవతారణి స్మారకార్థంగా 'భవత గర్ల్స్ ఆర్కెస్ట్రా' అనే కొత్త సంగీత బృందాన్ని ప్రారంభిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ ఆర్కెస్ట్రా ప్రత్యేకత ఏమిటంటే — ఇళయరాజా కొత్త ఆలోచన.. 15 ఏళ్లలోపు బాలికలకు అరుదైన అవకాశం! ఇందులో సభ్యులుగా 15 ఏళ్లలోపు ప్రతిభావంతులైన బాలికలు మాత్రమే ఉండనున్నారు. సంగీతంపై ఆసక్తి, నైపుణ్యం కలిగిన చిన్నారులకు ఇది జీవితాన్ని మార్చే గోల్డెన్ అవకాశం కానుంది
Details
కచేరి ప్రదర్శనలు ఇవ్వడానికి అవకాశం
ఇళయరాజా ఈ ఆలోచనను కొంతకాలం క్రితమే పంచుకున్నప్పటికీ, ఇప్పుడు దానిని ఆచరణలోకి తీసుకొచ్చారు. "భవత గర్ల్స్ ఆర్కెస్ట్రా ఏర్పాటును ప్రారంభించినట్లు ప్రకటిస్తూ, సోషల్ మీడియాలో ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఆసక్తి ఉన్న చిన్నారులు తమ పేరు, వయస్సు, సంగీత అనుభవం, సంప్రదింపు వివరాలు మొదలైనవాటిని [allgirlsorchestra@gmail.com](mailto:allgirlsorchestra@gmail.com) కి పంపాలని ఆయన సూచించారు. ఎంపికైన బాలికలు ఇళయరాజా సారథ్యంలో శిక్షణ పొందుతారు. తదుపరి లైవ్ మ్యూజిక్ కచేరీలలో ప్రదర్శనలు ఇవ్వడానికి వారికి అవకాశం లభించనుంది.
Details
కొత్త తరానికి ప్రేరణగా నిలవాలని ఆలోచన
తన కుమార్తె పేరు ఈ ఆర్కెస్ట్రాకు పెట్టడం వెనుక ఉన్న భావోద్వేగం ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. భవతారణి గాయని, సంగీత దర్శకురాలిగా తమిళ సినీ రంగంలో అనేక హిట్ పాటలను అందించారు. కానీ గత సంవత్సరం జనవరి 24న క్యాన్సర్‌తో ఆమె మరణించడం సంగీత ప్రపంచానికి పెద్ద లోటు. ఆమె స్మారకార్థంగా ఈ కొత్త ఆర్కెస్ట్రాను ప్రారంభించిన ఇళయరాజా నిర్ణయం సంగీత అభిమానుల హృదయాలను తాకుతోంది. ఈ భవత గర్ల్స్ ఆర్కెస్ట్రా కేవలం ఒక సంగీత బృందమే కాదు, చిన్నారుల ప్రతిభకు వేదికగా, కొత్త తరానికి ప్రేరణగా నిలిచే స్ఫూర్తిదాయక సంగీత యాత్రగా మారనుంది.