
Ileana: ముచ్చటగా మూడోసారి బిడ్డకు జన్మనివ్వనున్న ఇలియానా.. బేబీ బంప్ ఫోటోలు వైరల్!
ఈ వార్తాకథనం ఏంటి
స్టార్ హీరోయిన్ ఇలియానా ప్రస్తుతం సినిమాల కంటే తన వ్యక్తిగత జీవితంలో జరిగే విశేషాల కారణంగా వార్తల్లో ఎక్కువగా నిలుస్తోంది. ఇటీవల ఆమె భర్త మైఖేల్ డోలన్‌తో కలిసి రెండో బిడ్డకు జన్మనిచ్చిన విషయం అభిమానులకు తెలిసింది. ఇలియానా మొదట కోవా ఫీనిక్స్ డోలన్‌కు, ఆ తర్వాత కీను రాఫే డోలన్‌కు జన్మనిచ్చారు. తాజాగా ఆమె ఇప్పుడు మూడో బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ సంతోషకరమైన వార్తను ఇలియానా అభిమానులతో పంచుకోవడానికి సోషల్ మీడియాలో బేబీ బంప్ వీడియోను షేర్ చేశారు.
Details
శుభాకాంక్షలు తెలియజేస్తున్న అభిమానులు
వీడియోలో ఆమె బేబీ బంప్‌తో ఊయల సర్దుతూ కనిపించింది. ఆమె ఆనందాన్ని ఫ్యాన్స్‌తో పంచుకోవడమే కాదు, అభిమానులు వీడియోను చూసి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అభిమానులు తమ సోషల్ మీడియా రీ పోస్ట్‌ల ద్వారా ఇలియానా కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మూడో బిడ్డ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుతున్నారు.