LOADING...
Middle East Crisis : మిడిల్ ఈస్ట్ యుద్ధ ప్రభావం.. పాన్ ఇండియా ప్రాజెక్టులపై భారీ ప్రభావం
మిడిల్ ఈస్ట్ యుద్ధ ప్రభావం.. పాన్ ఇండియా ప్రాజెక్టులపై భారీ ప్రభావం

Middle East Crisis : మిడిల్ ఈస్ట్ యుద్ధ ప్రభావం.. పాన్ ఇండియా ప్రాజెక్టులపై భారీ ప్రభావం

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 16, 2026
10:34 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం భారతీయ సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రాలు 'వారణాసి', 'రాకా'విదేశీ షూటింగ్ షెడ్యూళ్లను మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. భద్రతా కారణాల దృష్ట్యా చిత్ర బృందాలు ఈ కీలక నిర్ణయం తీసుకున్నాయి. రాజమౌళి తెరకెక్కిస్తున్న, మహేష్ బాబు హీరోగా నటిస్తున్న అడ్వెంచర్ థ్రిల్లర్ 'వారణాసి'పై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఈచిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలను దుబాయ్‌లో చిత్రీకరించాలని మేకర్స్ ముందుగా ప్లాన్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రణాళికను తాత్కాలికంగా నిలిపివేశారు. దానికి బదులుగా హైదరాబాద్‌లో భారీ సెట్లు నిర్మించి షూటింగ్ నిర్వహించాలని రాజమౌళి నిర్ణయించినట్లు సమాచారం.

వివరాలు

విడుదల తేదీపై ప్రభావం పడే అవకాశం

ఇప్పటికే గ్లోబల్ లొకేషన్లలో చిత్రీకరణకు సిద్ధమైన ఈ మూవీ టీమ్ పరిస్థితులు సాధారణం అయ్యే వరకు వేచి చూడాలని భావిస్తోంది. అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'రాకా'సినిమా పరిస్థితి కూడా ఇదే విధంగా మారింది. ఈ చిత్రంలోని కీలక యాక్షన్ సన్నివేశాలను మిడిల్ ఈస్ట్ ఎడారుల్లో చిత్రీకరించాలని ప్లాన్ చేసినప్పటికీ, అక్కడ యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో షూటింగ్‌ను వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రత్యామ్నాయ లొకేషన్ల కోసం అన్వేషణ చేస్తోంది. అవసరమైతే ముంబై స్టూడియోలలో సెట్లు వేసి షూటింగ్ పూర్తి చేయాలని కూడా ఆలోచిస్తోంది. ఈ అనూహ్య మార్పుల కారణంగా చిత్రాల నిర్మాణ వ్యయం భారీగా పెరిగే అవకాశముంది. విడుదల తేదీలపై కూడా ప్రభావం పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Advertisement