Ram Charan: 'RC16'లో మీర్జాపూర్ నటుడు దివ్యేందు శర్మ.. హైప్ పెంచుతున్న డైరక్టర్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'గేమ్ చేంజర్' సినిమా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే రామ్ చరణ్ మరొక ప్రాజెక్టు ప్రకటించారు. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC16 సినిమా గురించి తాజా అప్డేట్‌ను మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. మైత్రీ మైవి మేకర్స్ బ్యానర్‌పై నిర్మాణం జరుగుతోంది. ఈ సినిమా కోసం ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
మైసూర్ లో షూటింగ్
ప్రస్తుతం మైసూర్‌లో సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇటీవల బుచ్చిబాబు RC16లో నటించబోతున్న నటుల గురించి అధికారిక ప్రకటనలు విడుదల చేశారు. ఇందులో స్టార్ నటుడు జగపతి బాబు, అలాగే 'మీర్జాపూర్' ఫేమ్ మున్నా భయ్యా దివ్యేందు శర్మ కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించారు. ఈ తాజా అప్డేట్‌తో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.