
Rashmika deepfake: డీప్‌ఫేక్ వీడియోపై రష్మిక మందన్న ఆవేదన
ఈ వార్తాకథనం ఏంటి
రష్మిక మందన్న ఫేక్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పొట్టి బట్టలు, కొంచెం అసహ్యంగా కనిపించే వస్త్రాధారణలో రష్మిక ఉన్నట్లు కనిపిస్తుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లోని డీప్‌ఫేక్ సాయంతో తయారు చేసిన ఈ వీడియోపై ప్రముఖులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా డీప్‌ఫేక్ వీడియోపై రష్మిక స్పందించింది. తన ఆవేదనను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది.
ఈ స్టోరీని షేర్ చేయడం చాలా బాధగా ఉందని పేర్కొంది. తన డీప్‌ఫేక్ వీడియో గురించి మాట్లాడవలసి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేసింది.
టెక్నాలజీని దుర్వినియోగం కావడంపై తనతో పాటు ప్రతి ఒక్కరికి కూడా చాలా భయంగా ఉందని పేర్కొంది. ఒక మహిళగా, నటిగా, తనకు రక్షణ, మద్దతు నిలిచిన వారికి రష్మిక కృతజ్ఞతలు తెలిపింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రష్మిక పెట్టిన ఇన్ స్టా స్టోరీ
I'm Completely agree with her. AI is going to be dangerous day by day...#RashmikaMandanna #deepfake pic.twitter.com/5mxyKuGRwu
— Viraj (@Yours_Viru) November 6, 2023