Varun Dhawan: అలియా, కియారాలతో అనుచిత ప్రవర్తన.. క్లారిటీ ఇచ్చిన వరుణ్ ధావన్
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌పై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు. ఇటీవల ఓ ఈవెంట్‌లో స్టార్ హీరోయిన్ అలియా భట్ ప్రైవేట్ పార్ట్స్‌ను పట్టుకోవడంతో దారుణమైన ట్రోల్స్ ఎదురయ్యారు. అలాగే ఓ సినిమా షూటింగ్‌లో మరో స్టార్ హీరోయిన్ కియారా అద్వానీని అందరి ముందు ముద్దు పెట్టుకోవడం కూడా నెటిజెన్స్ ఆక్రోశానికి కారణమైంది. ఈ పరిణామాలపై తాజాగా వరుణ్ ధావన్ క్లారిటీ ఇచ్చారు. శుభంకర్ మిశ్రా పోడ్‌కాస్ట్‌లో వరుణ్ ధావన్ మాట్లాడారు. తాను ఎప్పుడూ నా సహచర నటీనటులతో సరదాగా ప్రవర్తిస్తానని, అయితే ఈ విషయంలో తాను ఎవరితోనూ తప్పుగా ప్రవర్తించలేదని చెప్పారు. కియారాను ముద్దు పెట్టుకోవడం ఒక మ్యాగజైన్ ఫొటో షూట్‌లో భాగంగా జరిగిందన్నారు.
కిస్మస్ కానుకగా బేబీ జాన్ రిలీజ్
ఆ క్లిప్‌ను తాను, కియారా ఇద్దరం కలిసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశామన్నారు. అలియా కూడా తనకు మంచి ఫ్రెండ్ అని, ఆ రోజు తాము సరదాగా అలా చేశామని, అది అసలు ఏమి తప్పు కాదన్నారు. ఇక, వరుణ్ ధావన్ నటించిన 'బేబీ జాన్' సినిమా ఈ క్రిస్మస్ కానుకగా విడుదలైంది. కాలీస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు అట్లీ కథను అందించారు. ఈ సినిమాలో దక్షిణాది భామ కీర్తి సురేశ్ బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. వామికా గబ్బీ, జాకీ ష్రాఫ్, రాజ్‌పాల్ యాదవ్ కీలక పాత్రల్లో నటించారు, అలాగే సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటించారు.