
Srikanth Iyengar: గాంధీజీపై అనుచిత వ్యాఖ్యలు.. నటుడు శ్రీకాంత్ అయ్యంగార్‌పై ఫిర్యాదు!
ఈ వార్తాకథనం ఏంటి
సినీనటుడు శ్రీకాంత్ అయ్యంగార్ జాతిపిత మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ శనివారం సైబర్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాంధీజీని లక్ష్యంగా చేసుకుని చేసిన ఆ వ్యాఖ్యల వీడియోలను కూడా పోలీసులు పరిశీలించేందుకు ఆయన సమర్పించారు. వెంకట్ మాట్లాడుతూ, వాక్చాతుర్యం లేదా వాక్ స్వేచ్ఛ పేరుతో హద్దులు దాటి మాట్లాడటం అసహ్యకరమన్నారు.
Details
పోలీసులు చర్యలు తీసుకోవాలి
ఈ వ్యవహారంపై సినీ ప్రముఖులు కూడా తమ స్పందన ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. త్వరలో 'మా' అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణు మంచును కలిసి, శ్రీకాంత్ అయ్యంగార్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరతామని ప్రకటించారు. అలాగే, "గాడ్సే వారసులమంటూ చెప్పుకునే కొంతమంది ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నరని వ్యాఖ్యానించారు. ఈ కేసులో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.