Indian 3: భారతీయుడు-3 పై కీలక అప్డేట్.. డైరెక్ట్‌గా ఓటీటీలోకి..
అసలే ఇండియన్ 2 విడుదలతో మెగా ఫ్యాన్స్ కాస్త టెన్షన్‌లో ఉన్నారు. ఇప్పుడు శంకర్ సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి అన్న వార్తలు మరింత భయాందోళన కలిగిస్తున్నాయి. శంకర్ సినిమా డైరెక్ట్‌గా ఓటిటిలోకి రావడం ఏమిటి? అన్నది ప్రస్తుతం చర్చా అంశంగా మారింది. భారతీయుడు 2 చిత్రాన్ని మధ్యలో ఆగిన తర్వాత, శంకర్ రామ్ చరణ్ తో సినిమా ప్రారంభించారు. అయితే, కమల్ హాసన్ నటించిన విక్రమ్ చిత్రంను హిట్ కావడంతో, భారతీయుడు 2ని పునఃప్రారంభించేందుకు దృష్టి సారించారు. దీనికి కారణంగా గేమ్ ఛేంజర్ ప్రాజెక్టు కూడా ఆలస్యం అయింది. చివరికి, భారతీయుడు 2 విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది.
భారతీయుడు 3 కోసం భారీగా ఖర్చు
ప్రస్తుతం,భారతీయుడు 3 మాత్రం థియేటర్లోకి వచ్చే ఛాన్స్ లేదని తెలుస్తోంది. శంకర్ ఇప్పటికే రెండో పార్ట్‌తో పాటు, మూడో భాగం కూడా షూటింగ్ పూర్తి చేశాడు, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. భారతీయుడు 2 సక్సెస్ అయ్యి ఉంటే, వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు యోచించారు. కానీ ఇప్పుడు కంటెంట్ మీద నమ్మకం లేకపోవడంతో, నేరుగా ఓటీటీలో విడుదల చేయడం సేఫ్ అవుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. భారతీయుడు 3 కోసం భారీగా ఖర్చు చేసినందున, ఈ సినిమా హిట్ అయ్యేందుకు 300 కోట్లు వచ్చినా సరిపోదని సమాచారం.
గేమ్ ఛేంజర్ విడుదల తరువాతే, భారతీయుడు 3
భారతీయుడు 2 ఇప్పటికే భారీ నష్టాలను మిగిల్చింది. అందువల్ల, నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ డైరెక్ట్‌గా ఓటీటీలో ఈ మూవీని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. అయితే, గేమ్ ఛేంజర్ విడుదల తరువాతే, భారతీయుడు 3 ఓటిటీలో లేదా థియేటర్లో విడుదల చేయాలా అన్న నిర్ణయం తీసుకుంటారని మేకర్స్ చెబుతున్నారు. కానీ, కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, మెజారిటీ ఛాన్స్ ఓటిటికే ఉంది. ఇప్పటికే ఆ దిశగా చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. మరి భారతీయుడు 3 విడుదల ఎప్పుడు జరుగుతుందో చూడాలి.