
Record-breaking 2023: రూ.12,000 కోట్ల పైగా బాక్సాఫీస్ మైలురాయిని అందుకున్న భారతీయ సినిమా
ఈ వార్తాకథనం ఏంటి
2023 భారతీయ చలనచిత్ర పరిశ్రమకు గోల్డెన్ ఇయర్ అనే చెప్పాలి. జవాన్, పఠాన్, యానిమల్, గదర్ 2, జైలర్, సాలార్, లియో వంటి సినిమాలు అద్బుతమైన కలెక్షన్లతో బాక్సాఫీస్ వసూళ్ల వర్షాన్ని కురిపించాయి.
ఓర్మాక్స్ మీడియా ప్రచురించిన నివేదిక ప్రకారం, గత క్యాలెండర్ ఇయర్‌లో భారతీయ చలనచిత్ర పరిశ్రమ రూ. 12,226 కోట్ల వసూళ్ల మార్క్ టచ్ చేసింది. 2022తో పోలిస్తే, 2023లో కలెక్షన్లు 15% పెరిగాయి. భారతీయ పరిశ్రమకు ఇది ఉత్తమ సంవత్సరం.
ఈ ఏడాది వచ్చిన రూ. 12,226 కోట్లలో నార్త్ సినిమాల కాంట్రిబూషన్ రూ.5380 కోట్లు మాత్రమే. హిందీ పరిశ్రమ ఏడాది వ్యవధిలో 5000 కోట్ల మార్క్‌ను దాటడం చరిత్రలో ఇదే తొలిసారి.
Details
2023లో షారూఖ్ ఖాన్,రణబీర్ కపూర్ సినిమాలు సంచనాలు సృష్టించాయి
మహమ్మారి తర్వాత ప్రతీ ఏడాది తగ్గుతూ వస్తున్న బాలీవుడ్ బాక్సాఫీస్ ఆదాయం.. ఈ ఏడాది మాత్రం భారీగా పెరిగింది.
అయితే షారూఖ్ ఖాన్,రణబీర్ కపూర్ వంటి సూపర్ స్టార్‌ల సినిమాలు ఈ ఏడాది సంచనాలు సృష్టించాయి.
అంతేకాకుండా మీడియం-బడ్జెట్ చిత్రాలు కూడా మరోసారి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాయి.
దాదాపు 2300 కోట్ల షేర్‌తో టాలీవుడ్, తెలుగు చిత్ర పరిశ్రమ రెండో స్థానాన్ని ఆక్రమించింది.
ప్రభాస్,చిరంజీవి కాకుండా, ఇతర అగ్ర తారలు 2023లో ఒక్క సినిమా కూడా విడుదల చేయలేదు.
2023లో టాలీవుడ్ నుండి సాలార్ బిగ్గెస్ట్ హిట్, వాల్తేర్ వీరయ్య తర్వాతి స్థానంలో ఉంది. 2024లో రిలీజ్‌కు రెడీ అవుతున్న సౌత్ సినిమాల లిస్ట్ కూడా బాక్సాఫీస్ లెక్కల మీద ఆశలు కల్పిస్తోంది.
Details
బాలీవుడ్ 53% వార్షిక వృద్ధి.. 61% తగ్గిన కన్నడ ఇండస్ట్రీ
కోలీవుడ్ సహకారం 16%, అంటే దాదాపు 1960 కోట్లు. వీరిలో జైలర్, లియో 1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి.
హాలీవుడ్ (1139 కోట్లు), మాలీవుడ్ (572 కోట్లు), శాండల్‌వుడ్ (312 కోట్లు) వరుసగా నాల్గవ, ఐదవ, ఆరవ స్థానాలను ఆక్రమించాయి.
బాలీవుడ్ 53% వార్షిక వృద్ధిని సాధించగా, కన్నడ పరిశ్రమ సహకారం 61% తగ్గింది. కలెక్షన్ ల ట్రెండ్‌ను చూస్తే , మహమ్మారి ముందు ఉన్నప్పటి కంటే కూడా తక్కువగా ఉన్నాయి.
ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఏమిటంటే.. టికెట్ ధరలు పెరగడం వల్ల కలెక్షన్లు పెరిగాయి, కానీ అలాగని ఆదాయం పెరగలేదు.
మరింత ముందుకు వెళ్లాలంటే,ఇండియన్ సినిమా మరింత నాణ్యమైన కంటెంట్‌పై దృష్టి పెట్టాలి.