
సలార్ సినిమా నుండి పృథ్వీరాజ్ సుకుమార్ లుక్ విడుదల: వరదరాజ మన్నార్ పాత్రలో భయపెడుతున్న నటుడు
ఈ వార్తాకథనం ఏంటి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాపై అభిమానులు భారీగా అంచనాలు ఉన్నాయి.
కేజీఎఫ్ సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటివరకు సినిమా నుండి గ్లింప్స్ మాత్రమే విడుదలైంది.
తాజాగా సలార్ సినిమాలో విలన్ గా నటిస్తున్న మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రను పరిచయం చేశారు.
వరదరాజ్ మన్నార్ అనే పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ సలార్ సినిమాలో కనిపించబోతున్నారని చిత్ర నిర్మాణ సంస్థ హాంబలే ఫిలిమ్స్ ప్రకటించింది.
మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ చాలా భయంకరంగా కనిపిస్తున్నాడు. ఈ లెక్కన సలార్ సినిమాలో విలనిజం వేరే లెవెల్ లో ఉండబోతుందని తెలుస్తోంది.
Details
ప్రభాస్ పుట్టిన రోజున సలార్ టీజర్ విడుదల
సలార్ సినిమా నుండి ఇప్పటివరకు గ్లింప్స్ మాత్రమే విడుదలైంది. ప్రభాస్ అభిమానులందరూ సలార్ టీజర్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, సలార్ సినిమా టీజర్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
అంతే కాదు, సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో సలార్ నుండి మరొక ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ వీడియో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.
జగపతిబాబు, ఈశ్వరి రావు ప్రధాన పాత్రలో కనిపిస్తున్న సలార్ సినిమా డిసెంబర్ 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది.