Loading...
Prince William India Visit: 'ఆర్ఆర్ఆర్'తో భారతీయ సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు.. ప్రిన్స్ విలియమ్‌తో కరణ్ చర్చ
'ఆర్ఆర్ఆర్'తో భారతీయ సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు.. ప్రిన్స్ విలియమ్‌తో కరణ్ చర్చ

Prince William India Visit: 'ఆర్ఆర్ఆర్'తో భారతీయ సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు.. ప్రిన్స్ విలియమ్‌తో కరణ్ చర్చ

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 18, 2026
05:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియమ్ (Prince William) బుధవారం ముంబయిలోని ధర్మ ప్రొడక్షన్స్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) ఆయనకు భారతీయ సినిమా విశేషాలను వివరించారు. తన దర్శకత్వంలో తెరకెక్కిన 'కభీ ఖుషీ కభీ గమ్' (Kabhi Khushi Kabhie Gham) చిత్రాన్ని వీక్షించాలని కోరారు. ఈ సినిమా చిత్రీకరణలో ఎక్కువ భాగం యూకేలోనే జరిగినట్లు యువరాజుకు తెలిపారు. అలాగే, అంతర్జాతీయంగా భారతీయ చిత్రాలకు పెరుగుతున్న ఆదరణ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కరణ్‌తో పాటు నటులు సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ కూడా పాల్గొన్నారు.

వివరాలు

'ఆర్ఆర్ఆర్'తో భారతీయ సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు

భారతదేశంలో అనేక భాషల్లో సినిమాలు తెరకెక్కుతున్నాయని కరణ్ జోహార్ ప్రిన్స్ విలియమ్‌కు వివరించారు.

ఎస్‌.ఎస్‌.రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ఆర్ఆర్' (RRR) అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సినిమాకు గుర్తింపు తీసుకొచ్చిందని చెప్పారు.

ప్రస్తుతం సినిమా కథల్లోనూ మార్పులు వస్తున్నాయని, దేశంలోని పల్లె ప్రాంతాల నేపథ్యంతో తెరకెక్కుతున్న కథలకు ప్రేక్షకులు ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారని వివరించారు.

ముఖ్యంగా పశ్చిమాసియా దేశాల్లో భారతీయ సినిమాలకు మంచి మార్కెట్ ఉందని విలియమ్‌కు తెలిపినట్లు కరణ్ పేర్కొన్నారు.

వివరాలు

క్రికెట్‌పైనా చర్చ.. లండన్‌తో అనుబంధాన్ని పంచుకున్న సైఫ్, కరీనా

ఈ భేటీలో క్రికెట్ గురించి కూడా చర్చ జరిగినట్లు కరణ్ వెల్లడించారు. సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ సైతం లండన్‌తో తమకున్న అనుబంధాన్ని యువరాజుతో పంచుకున్నారట.

'కభీ ఖుషీ కభీ గమ్' పాటలకు ప్రత్యేక నృత్యాలు

ప్రిన్స్ విలియమ్ పర్యటన సందర్భంగా 'కభీ ఖుషీ కభీ గమ్' చిత్రంలోని 'సే శావా శావా', 'బోలే చూడియాన్' పాటలకు సంప్రదాయ దుస్తుల్లో కళాకారులు నృత్యాలు చేశారు.

అనంతరం భారతీయ వంటకాలతో అతిథులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.

ADVERTISEMENT