అంతర్జాతీయ మహిళా దినోత్సవం: తెలుగు సినిమా దశను మార్చిన హీరోయిన్స్
ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా తెలుగు సినిమాలో మహిళల పాత్రను, తెలుగు సినిమాను మార్చిన మహిళల గురించి ఇక్కడ తెలుసుకుందాం. తెలుగు సినిమాకు సరికొత్త అందాన్ని, స్టైల్ ని తీసుకొచ్చిన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. వారందరిలో నుండి ఇక్కడ కొంతమంది గురించి మాట్లాడుకుందాం. అంజలీ దేవి: అప్పట్లో సీత పాత్రలో అంజలి దేవి ఎక్కువగా కనిపించేవారు. మొదటి రంగుల చిత్రం లవకుశ లో హీరోయిన్ గా కనిపించారు. జానపదాలు, పౌరాణికాలు అన్ని జోనర్లలో దాదాపు 350కి పైగా చిత్రాల్లో కనిపించారు. భానుమతి: హీరోయిన్ గా దర్శకురాలిగా, సంగీత దర్శకురాలిగా, రచయిత్రిగా, గాయనిగా పనిచేసారు భానుమతి. మూడు దశాబ్దాల పాటు తెలుగు సినిమాల్లో కనిపించారు.
తెలుగు సినిమా దశను మార్చిన మహిళామణులు
విజయ నిర్మల: చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ఆరంభించిన విజయ నిర్మల, 200కి పైగా చిత్రాల్లో నటించారు. అంతేకాదు 47సినిమాలకు దర్శకత్వ బాధ్యతలు చేపట్టినందుకు గిన్నిస్ రికార్డ్ అందుకున్నారు. కాంచన మాల: పౌరాణిక చిత్రాల్లో నటించిన కాంచన మాల, మొట్ట మొదటి బికీనీ ధరించిన హీరోయిన్ గా చరిత్రకెక్కారు. అప్పట్లో తన గ్లామర్ తో అందరి మనసులు దోచుకున్నారు కాంచనమాల. సావిత్రి: మహానటి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆమె నటించిన కాలం స్వర్ణయుగం అని చెప్పవచ్చు. 300కి పైగా చిత్రాల్లో నటించి తెలుగు చిత్ర పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఇంకా ఈ లిస్టులో జయప్రద, జయసుధ, జమున, విజయ లలిత, శ్రీదేవి, విజయ శాంతి ఇలా చాలామంది ఉన్నారు.