Page Loader
ఆర్ఆర్ఆర్ కథ మొత్తం నాటు నాటు పాటలో ఉందంటున్న రాజమౌళి
హాలీవుడ్ జనాల కోసం నాటు నాటు పాటను వివరిస్తున్న రాజమౌళి,

ఆర్ఆర్ఆర్ కథ మొత్తం నాటు నాటు పాటలో ఉందంటున్న రాజమౌళి

వ్రాసిన వారు Sriram Pranateja
Mar 07, 2023
04:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ మూవీకి అంతర్జాతీయంగా ఎన్ని ప్రశంసలు అందుతున్నాయో అందరూ చూస్తూనే ఉన్నారు. ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్లో కూడా ఉంది. ఈ నేపథ్యంలో నాటు నాటు పాట గురించి రాజమౌళి వివరించారు. హాలీవుడ్ జనాల కోసం నాటు నాటు పాట నేపథ్యాన్ని, ఆ పాట తీయడం వెనుక వాళ్ళు చేసిన పనిని గుర్తు చేసుకొన్నాడు. నిజానికి నాటు నాటు పాట టైమ్ లో ఒక ఫైట్ సీన్ పడాలి. కానీ ఫైట్ లోని ఎమోషన్ ని పాటతో చూపించామని అన్నారు. అంతేగాక బ్రిటిషర్లను ఓడించాలంటే ముందుగా తామిద్దరూ కలవాలని, ఆ తర్వాతే బ్రిటీషు వాళ్ళను ఓడించగలమని, అది పాటలో చూపించామని, సినిమా కథ అదేనని అన్నారు.

రాజమౌళి

ఉక్రెయిన్ డ్యాన్సర్ లపై పొగడ్తలు కురిపించిన రాజమౌళి

నాటు నాటు పాటను ఇండియాలోనే షూట్ చేద్దామనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల కుదరక, ఉక్రెయిన్ లోని ప్రెసిడెన్షియల్ హాల్ ముందు తీసారట. ఉక్రెయిన్ డాన్సర్లు చాలా బాగా చేసారనీ అన్నారు. ముఖ్యంగా కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ గురించి మాట్లాడుతూ, చరణ్, తారక్ లతో గతంలో పనిచేసిన అనుభవం ప్రేమ్ రక్షిత్ కి ఉండడం వల్ల వాళ్ళ డాన్సింగ్ స్టైల్ కి తగ్గట్టుగా కొరియోగ్రఫీ చేసాడని అన్నారు. ఇంకా, పాట రాసిన చంద్రబోస్ గురించి చెబుతూ, అందరికీ సులభంగా ఉండేలా నాటు నాటు అనే పదాలను వాడడం వల్ల ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు నాటు నాటు అంటున్నారని అన్నారు. ఆస్కార్ అవార్డులు దగ్గర పడుతున్న వేళ నాటునాటుపై రాజమౌళి వీడియో బాగుందని ప్రశంసిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హాలీవుడ్ జనాల కోసం నాటు నాటు పాటను వివరిస్తున్న రాజమౌళి,