నాటు నాటు పాటను వింటూ సందడి చేసిన సౌత్ కొరియా సింగర్ జాంగ్ కూక్
ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటకు స్టెప్పులేయని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. తెలుగు నుండి మొదలెడితే అంతర్జాతీయ స్థాయిలో నాటు నాటు పాటకు స్టెప్పులేస్తూ చాలామంది కనిపించారు. తాజాగా దక్షిణ కొరియా సింగర్ జాంగ్ కూక్, నాటు నాటు పాటను వింటూ మైమర్చిపోయాడు. సౌత్ కొరియాలోని బీటీఎస్ బ్యాండ్ గ్రూప్ సింగర్ అయిన జంగ్ కూక్, లైవ్ లో నాటు నాటు పాటను వింటూ కనిపించాడు. నాటు నాటు పాట అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపించాడు. ఆర్ఆర్ఆర్ టీమ్ సోషల్ హ్యాండిల్ కూడా ఈ వీడియోను షేర్ చేసి, నాటు నాటు పాటను జాంగ్ కూక్ ప్రశంసించడం సంతోషంగా ఉందని పోస్ట్ చేసింది.
మార్చ్ 13వ తేదీన ఆస్కార్ వేదిక మీద నాటు నాటు పాట లైవ్
ఆస్కార్ నామినేషన్లలో నిలిచిన నాటు నాటు పాట, అంతర్జాతీయంగా ఎన్నో ప్రశంసలు తెచ్చుకుంటోంది. ఇదే లెవెల్లో ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంటుందని అందరూ భావిస్తున్నారు. ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం లాస్ ఏంజిల్స్ లోని బేవ్రీ హిల్స్ లో మార్చ్ 13వ తేదీన ఉండనుంది. ఈ వేదిక మీద నాటు నాటు పాట లైవ్ ఉండనుందని అకాడమీ అవార్డ్స్ ప్రకటించింది. సినిమాలో పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరలు కలిసి ఆస్కార్ వేదిక మీద నాటు నాటు పాటను పాడబోతున్నారు. అంతేకాదు, రామ్ చరణ్, ఎన్టీఆర్ లు నాటు నాటు పాటకు స్టెప్పులు వేసే అవకాశం కూడా ఉంది. ఈ మేరకు రామ్ చరణ్ ఆల్రెడీ ప్రకటించాడు కూడా. మరేం జరుగుతుందో చూడాలి.