NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్: ఎన్టీఆర్ అమెరికా ప్రయాణం ఎప్పుడు ఉంటుందంటే?
    తదుపరి వార్తా కథనం
    ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్: ఎన్టీఆర్ అమెరికా ప్రయాణం ఎప్పుడు ఉంటుందంటే?
    మార్చ్ 6వ తేదీన ఎన్టీఆర్ అమెరికా ప్రయాణం అంటూ వార్తలు

    ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్: ఎన్టీఆర్ అమెరికా ప్రయాణం ఎప్పుడు ఉంటుందంటే?

    వ్రాసిన వారు Sriram Pranateja
    Mar 01, 2023
    10:07 am

    ఈ వార్తాకథనం ఏంటి

    హాలీవుడ్ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్ ఫంక్షన్ కి ఎన్టీఆర్ వెళ్ళకపోవడంతో ఆయన అభిమానుల్లో కొంత నిరాశ నెలకొంది. ఆర్ఆర్ఆర్ బృందానికి దక్కిన గౌరవంలో ఎన్టీఆర్ లేకపోయాడే అని అందరూ ఫీలయ్యారు.

    అలాంటి వారికి ఇప్పుడు మంచి వార్త అందింది. తారకరత్న స్వర్గస్తులు కావడం వల్ల అమెరికాకు వెళ్ళలేకపోయారు ఎన్టీఆర్. ఐతే ఇప్పుడు తారకరత్న పెద్ద కర్మ తర్వాత అమెరికాకు పయనం అవుతున్నారని తెలుస్తోంది.

    మార్చ్ 2వ తేదీన తారకరత్న పెద కర్మ ఉండనుందని, ఆ తర్వాత 4రోజులకు అంటే మార్చ్ 6వ తేదీన, అమెరికా ప్రయాణం ఉంటుందని, ఆర్ఆర్ఆర్ టీమ్ లో కలిసిపోతారని వినిపిస్తోంది.

    ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.

    ఆర్ఆర్ఆర్

    మార్చ్ 13వ తేదీన ఆస్కార్స్ అవార్డుల ప్రధానం

    ఉత్తమ పాట విభాగంలో ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్లలో నిలిచింది. నాటు నాటు పాట, ఆల్రెడీ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకున్న సంగతి తెలిసిందే.

    ఆస్కార్స్ అవార్డుల కార్యక్రమానికి ఆర్ఆర్ఆర్ టీమ్ లోని నాటు నాటు పాట రచయిత చంద్రబోస్, పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ లు కూడా హాజరవుతున్నారు.

    ఆస్కార్స్ వేదిక మీద రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ లు నాటు నాటు పాటను పాడబోతున్నారు. ఈ మేరకు అకాడమీ అవార్డ్స్, ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.

    భారత కాలమానం ప్రకారం మార్చ్ 13న ఆస్కార్స్ అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. లాస్ ఏంజిల్స్ లోని బేవ్రీ హిల్స్ లో గల డాల్బీ థియేటర్ లో అవార్డుల ప్రధానోత్సవం ఉంటుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్

    ఆర్ఆర్ఆర్ సీక్వెల్: కన్ఫ్యూజన్ లో పడేసిన రాజమౌళి సినిమా
    ఆస్కార్స్: రిమైండర్ లిస్ట్ లో ఆర్ఆర్ఆర్ తో పాటు ఆ మూడు ఇండియన్ సినిమాలు సినిమా
    ఆర్ఆర్ఆర్: గోల్డెన్ గ్లోబ్ లో నాటు నాటు పాటకు అవార్డ్, ఆ క్యాటగిరీలో మిస్ తెలుగు సినిమా
    ఆర్ఆర్ఆర్ హీరోలకు హాలీవుడ్ లో అవకాశం? తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025