హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డ్స్ ఆహ్వానం ఎన్టీఆర్ కి అందలేదా? నిజమేంటంటే?
హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ తన సత్తాను చాటింది. నాలుగు విభాగాల్లో పురస్కారాలు అందుకుని అంతర్జాతీయంగా ఖ్యాతి గడించింది. ఐతే ఈ అవార్డు ఫంక్షన్ లో రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణి పాల్గొన్నారు. ఎన్టీఆర్ మాత్రం కనిపించలేదు. దీంతో సోషల్ మీడియాలో అనేక పుకార్లు వచ్చాయి. ఎన్టీఆర్ కి ఆహ్వానం అందివ్వలేదా అని హెచ్ సీ ఏ మీద విరుచుకుపడ్డారు. ఈ విషయమై హెచ్ సీ ఏ, క్లారిటీ ఇచ్చింది. ట్విట్టర్ వేదికగా సోషల్ మీడియాలో వస్తున్న ప్రశ్నలకు సమాధానమిచ్చిన హెచ్ సీ ఏ, ఎన్టీఆర్ కు ఆహ్వానం పంపించామని, కానీ పర్సనల్ కారణాల వల్ల ఆయన రాలేకపోయారనీ, మరికొద్ది రోజుల్లో ఎన్టీఆర్ వస్తారనీ, తెలిపింది.
ట్విట్టర్ వేదికగా ఎన్టీఆర్ ఎందుకు రాలేకపోయాడో క్లారిటీ ఇచ్చిన హెచ్ సీ ఏ
ఎన్టీఆర్ కోసం స్పెషన్ అవార్డ్
అటు కొరటాల షుటింగ్, ఇటు తారకరత్న మరణం కారణంగా ఆయన రాలేకపోయారనీ ట్విట్టర్ వేదికగా హెచ్ సీ ఏ వెల్లడిచేసింది. ఐతే మరికొద్ది రోజుల్లో ఎన్టీఆర్ వస్తారనీ, ఆయన కోసం ఉంచిన అవార్డులను అందుకుంటారనీ చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులు శాంతించారు. హెచ్ సీ ఏ అవార్డుల్లో ఉత్తమ పాట విభాగంలో, ఉత్తమ అంతర్జాతీయ చిత్రం విభాగంలో, ఉత్తమ స్టంట్స్ విభాగంలో, ఉత్తమ యాక్షన్ విభాగంలో అవార్డులు సొంతం చేసుకుంది ఆర్ఆర్ఆర్. మొత్తానికి అంతర్జాతీయ వేదికగా భారతీయ జెండాను ఎగరవేసింది ఆర్ఆర్ఆర్. ఇదే ఊపుతో ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంటుందని భారతీయులందరూ భావిస్తున్నారు. ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం మార్చ్ 13వ తేదీన జరగనుంది. ఉత్తమ పాట విభాగంలో నాటు నాటు పాట నామినేషన్లో ఉంది.