LOADING...
IPL Playoff Chance: ప్లేఆఫ్స్ దిశగా ఐపీఎల్ రేసు.. ఆ రెండు జట్ల ఆశలు గల్లంతు!
ప్లేఆఫ్స్ దిశగా ఐపీఎల్ రేసు.. ఆ రెండు జట్ల ఆశలు గల్లంతు!

IPL Playoff Chance: ప్లేఆఫ్స్ దిశగా ఐపీఎల్ రేసు.. ఆ రెండు జట్ల ఆశలు గల్లంతు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 26, 2026
07:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటున్న ఐపీఎల్ 2026 సీజన్ ప్రస్తుతం అత్యంత కీలక దశకు చేరుకుంది. సగం మ్యాచ్‌లు పూర్తయ్యే సమయానికి పాయింట్ల పట్టికలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. గత సీజన్లలో తడబడిన జట్లు ఈసారి అద్భుత ఫామ్‌తో దూసుకుపోతుంటే, బలమైన జట్లుగా భావించిన కొన్ని జట్లు గెలుపు కోసం కష్టపడుతున్నాయి. ప్రతి మ్యాచ్ ఫలితం ప్లేఆఫ్స్ సమీకరణాలను పూర్తిగా మార్చేస్తూ లీగ్‌ను మరింత ఉత్కంఠభరితంగా మార్చుతోంది. ముఖ్యంగా టాప్-4 స్థానాల కోసం జట్ల మధ్య నెలకొన్న తీవ్ర పోటీ ఈ సీజన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

వివరాలు

ఫ్లే ఆఫ్ రేసులో ఆర్సీబీ ముందంజ

పట్టికను పరిశీలిస్తే పంజాబ్ కింగ్స్(PBKS), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH), రాజస్థాన్ రాయల్స్ జట్లు టాప్-4లో నిలిచి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. పంజాబ్ కింగ్స్ ఈసారి సమిష్టి ప్రదర్శనతో వరుస విజయాలు సాధిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ సమతుల్య ప్రదర్శనతో జట్టు బలంగా కనిపిస్తోంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తన దూకుడును తగ్గించకుండా వరుస విజయాలతో ప్లేఆఫ్స్ రేసులో ముందంజలో కొనసాగుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు భారీస్కోర్లతో ప్రత్యర్థులకు భయపెడుతూ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని బలపరచుకుంది. రాజస్థాన్ రాయల్స్ మాత్రం ఒకసారి గెలుపు, మరోసారి ఓటమి అనే స్థిరత్వం లేని ప్రదర్శనతోనూ నాలుగో స్థానాన్ని కాపాడుకుంటూ ప్లేఆఫ్స్ అవకాశాలను కొనసాగిస్తోంది.

వివరాలు

ముంబై, చైన్నై జట్లకు కష్టమే

మరోవైపు గతంలో ఛాంపియన్లుగా నిలిచిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి జట్లు ఈసారి టాప్-4లో స్థానం దక్కించుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రాబోయే మ్యాచ్‌లు ఈ రెండు జట్లకు అత్యంత కీలకంగా మారాయి. చిన్న పొరపాటు జరిగినా ప్లేఆఫ్స్ అవకాశాలు దెబ్బతినే పరిస్థితి నెలకొంది. ఈ సీజన్ మధ్యలో ఉన్న పరిస్థితులను గమనిస్తే కొత్త ఛాంపియన్‌ను చూసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అభిమానులు కూడా తమ అభిమాన జట్లు సెమీఫైనల్స్‌కు చేరాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే కేకేఆర్, ముంబై ఇండియన్స్ జట్లు ఈ ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపు బయటపడినట్లుగా క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Advertisement