NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఐపీఎస్ ఆఫీసర్ తో గొడవ పెట్టుకున్న డింపుల్ హయాతి; కేసు నమోదు 
    తదుపరి వార్తా కథనం
    ఐపీఎస్ ఆఫీసర్ తో గొడవ పెట్టుకున్న డింపుల్ హయాతి; కేసు నమోదు 
    డింపుల్ హయాతిపై కేసు నమోదు

    ఐపీఎస్ ఆఫీసర్ తో గొడవ పెట్టుకున్న డింపుల్ హయాతి; కేసు నమోదు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 23, 2023
    03:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టాలీవుడ్ భామ డింపుల్ హయాతి, తనకు కాబోయే భర్త డేవిడ్ పై హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

    ఐపీఎస్ ఆఫీసర్ కారును తన్నడం, డ్రైవర్ పట్ల అనుచిత ప్రవర్తన కారణంగా కేసు నమోదైంది.

    అసలేం జరిగిందంటే:

    ఐపీఎస్ ఆఫీసర్ రాహుల్ హెగ్డే, డింపుల్ హయాతి ఒకే అపార్ట్ మెంట్ లో ఉంటున్నారు. ఆ అపార్ట్ మెంట్ లోని పార్కింగ్ ప్లేస్ లో రాహుల్ హెగ్డే కారును డేవిడ్ ఢీకొట్టాడు.

    ఐపీఎస్ ఆఫీసర్ కారులో ఉన్న డ్రైవర్ చేతన్ కుమార్, ఇదేంటని ప్రశ్నించడంతో డింపుల్ హయాతి కారు దిగి వాదనకు దిగిందట.

    ఆ గొడవలో ఐపీఎస్ కారును కాలితో తన్నిందని తన ఫిర్యాదులో ఐపీఎస్ అధికారి తెలియజేసాడు.

    Details

    హీరోయిన్ గా ఇప్పుడిప్పుడే అవకాశాలు తెచ్చుకుంటున్న డింపుల్ 

    ఐపీఎస్ అధికారి ఫిర్యాదు మేరకు డింపుల్ హయాతి, తనక్కాబోయే భర్త డేవిడ్ మీద.. ఐపీసీ సెక్షన్లు 353, 341, 271ప్రకారం కేసు నమోదయ్యింది.

    డింపుల్ హయాతి ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా అవకాశాలు తెచ్చుకుంటోంది. రవితేజ సరసన ఖిలాడీ, గోపీచంద్ సరన రామబాణం చిత్రాల్లో మెరిసింది డింపుల్. ఈ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీసు దగ్గర డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి.

    హీరోయిన్ గా సినిమాలు చేయకముందు గద్దలకొండ గణేష్ సినిమాలో సూపర్ హిట్టు, బొమ్మా హిట్టూ అనే ప్రత్యేకమైన పాటలో మెరిసింది డింపుల్ హయాతి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    టాలీవుడ్

    తాజా

     Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి జమ్ముకశ్మీర్
    Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత! బాలీవుడ్
    Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం! ఎన్‌కౌంటర్
    Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు డొనాల్డ్ ట్రంప్

    తెలుగు సినిమా

    విరూపాక్ష ఓటీటీ రిలీజ్ పై అధికారిక అప్డేట్: స్ట్రీమింగ్ ఎక్కడంటే  సాయి ధరమ్ తేజ్
    మరోసారి పెళ్ళి విషయమై వార్తల్లోకి ఎక్కిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి; జూన్ లో ఎంగేజ్మెంట్ అంటున్నారే?  వరుణ్ తేజ్
    కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాతో స్పై సినిమాకు సంబంధం ఉందా అనే ప్రశ్నకు క్లారిటీ ఇచ్చిన హీరో నిఖిల్ సినిమా రిలీజ్
    హ్యాపీ బర్త్ డే ఛార్మి: హీరోయిన్ నుండి ప్రొడ్యూసర్ గా మారిన ఛార్మి జీవితంలోని ఆసక్తికర విషయాలు  పుట్టినరోజు

    టాలీవుడ్

    అల్లు అరవింద్ భారీ ఆఫర్.. ఆ సినిమాల్లో హీరో నిఖిల్ కి షేర్ తెలుగు సినిమా
    2022: తెలుగు తెరకు పరిచయమైన డబ్బింగ్ హీరోలు.. మొదటి స్థానంలో ఎవరున్నారంటే తెలుగు సినిమా
    వాల్తేరు వీరయ్య: మేకింగ్ వీడియోలో చిరంజీవి నుండి మరో లీక్ తెలుగు సినిమా
    ఫలానా అమ్మాయి ప్రేమలో నాగశౌర్య.. కొత్త సినిమా ప్రకటన తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025