Iran Pop Singer: ప్రవక్తను అవమానించిన కేసులో ఇరాన్ పాప్ స్టార్ టాటాలూకు మరణశిక్ష
ఈ వార్తాకథనం ఏంటి
మొహమ్మద్ ప్రవక్తను అవమానించాడని ఇరాన్ పాప్ సింగర్ ఆమిర్ హుస్సేన్ మగ్‌సౌద్లూకు (Iran Pop Singer) ఇరాన్ కోర్టు మరణశిక్ష విధించింది.
సింగర్ ఆమిర్‌ను టట్లూగా కూడా పిలుస్తారు. ఆయనపై దేశద్రోహానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి.
గతంలో ఇదే కేసులో ఆయనకు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. కానీ, ప్రాసిక్యూటర్ అభ్యంతరాలను సుప్రీం కోర్టు ఆమోదించి, కేసును మళ్లీ తెరవమని ఆదేశించి, సింగర్ ఆమిర్‌కు మరణశిక్ష ఖరారు చేశారు.
ప్రవక్తను అవమానించిన ఘటనకు సంబంధించి ఈ శిక్ష విధిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. అయితే, ఈ తీర్పుపై సింగర్ అప్పీల్ చేసుకునే అవకాశం కూడా కల్పించారు.
వివరాలు
ఇస్తాంబుల్‌లో రహస్యంగా జీవనం..
37 ఏళ్ల ఈ మ్యూజిక్ సింగర్ 2018 నుంచి ఇస్తాంబుల్‌లో రహస్యంగా జీవనం సాగిస్తున్నారు.
కానీ, 2023 డిసెంబరులో టర్కీ పోలీసులు ఆయనను ఇరాన్‌కు అప్పగించారు. అప్పటి నుంచి ఆయన ఇరాన్ కస్టడీలోనే ఉన్నారు.
వ్యభిచారాన్ని ప్రోత్సహించిన కేసులో టట్లూకు పది సంవత్సరాల శిక్ష విధించబడింది.
అదేవిధంగా, ఇస్లాం వ్యతిరేక ప్రచారం చేశారనే మరొక కేసులో కూడా శిక్ష విధించారు.